ఏపీ మండలిలో గందరగోళం నెలకొంటోంది.టీడీపీ నేతల తీరుతో సభ కార్యకలాపాలకు అడ్డంకిగా మారుతోంది.
టీడీపీ ఎమ్మెల్సీలు చిడతలు వాయించడం చర్చకు దారితీస్తోంది.నాటుసారా మరణాలపై చర్చించాలంటూ ఆందోళన చేశారు.
చేస్తూనే ఉన్నారు.ఈక్రమంలో 12న శాసన మండలిలో టీడీపీ సభ్యులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
చిడతలు వాయిస్తూ, విజిల్స్ వేస్తూ వింతగా ప్రవర్తించారు.దీంతో వారిపై చైర్మెన్ మోషెన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో ఇలాంటివి చేయడం సరికాదని, అసలుసభకు చిడతలు, విజిల్స్ ఎందుకు తెచ్చారని , సభలో చిడతలు వాయించడం ఏంటీ ? సభా గౌరవాన్ని కాపాడే బాధ్యత మీకు లేదా ? అంటూ మండిపడ్డారు.ఇలా భజనలు చేయడం సరికాదని, వెల్ లోకి వచ్చి మాట్లే హక్కు మీకు లేదని హితవు పలికారు.
మీ సీట్లలో మీరు కూర్చుని మాట్లాడండి అని చెప్పారు.టీడీపీ సభ్యులు కావాలనే గొడవ చేస్తున్నారని అన్నారు.సభా సమయాన్ని వృధా చేయొద్దని సూచించారు.అయినా వారి తీరు మారకపోవడంతో ఒక్క రోజు వారిని సస్పెండ్ చేశారు.

దీంతో టీడీపీ సభ్యుడు దీపక్‌రెడ్డి పోడియంపైకి ఎక్కడానికి దూసుకెళ్లగా మార్షల్స్ అడ్డుకున్నారు.సస్సెండ్ చేస్తే దౌర్జన్యం ఏంటని చైరె్మన్ వాదించారు.దీంతో చైర్మెన్ మోషెన్ రాజుపై ప్లకార్డులు విసిరి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లడం గమనార్హం.కాగా సస్పెండ్ అయిన వారిలో అర్జునుడు, అశోక్‌బాబు, దీపక్ రెడ్డి, ప్రభాకర్, రమ్మోహన్, రామారావు, రవీంద్రనాథ్ ఉన్నారు.
అర్జునుడు అశోక్ బాబు దీపక్ రెడ్డి ప్రభాకర్ రామ్మోహన్ రామారావు రవీంద్రనాథ్ ఉన్నారు.మొత్తంగా అటు అసెంబ్లీ… ఇటు మండలిలోనూ మొదటి నుంచి టీడీపీ ఆందోళనలు చేస్తోంది.
జంగారెడ్డి గూడెంలో కల్తీసారా మరణాలపై చర్చకు పట్టుబడుతూ ఈ ఆందోళనలు చేస్తున్నారు.అయితే ఆ మరణాలను సాధారణ మరణాలని చెప్పడం గమనార్హం.
దీంతో ఇరుపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది.మొత్తంగా టీడీపీ సభ్యుల వ్యవహారం విమర్శలకు తావిస్తోంది.
ఇలానే తీరు ఉంటే భవిష్యత్‌లో మరన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.