పిల్లలకు సరదాగా బండి నడపడం, లేదా కారు నేర్పడం చేయవచ్చు అయితే వాటిని జనావాసాల్లో కాకుండా ఎవరూ తిరగని ప్రాంతాలలో అయితే ఎలాంటి ప్రాణ , ఆర్ధిక నష్టం ఉండదు.అయితే అమెరికాలో ఇలాంటివి ఏమి పట్టని ఓ తండ్రి కొడుకులు ఏకంగా రద్దీగా ఉండే ప్రాంతంలో అతి వేగంగా ట్రక్ ని నడిపారు దాంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.13 ఏళ్ళ పిల్లాడు సరదా కోసం చేసిన పని 9 మందిని పొట్టన బెట్టుకుంది.అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా అందరిని కలిచి వేసింది.
అసలేం జరిగిందంటే.
రెండు రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.13 ఏళ్ళ బాలుడు తన తండ్రితో కలిసి టెక్సాస్ హైవేపై ఓ హెవీ ట్రక్ ను వేగంగా నడుపుతున్నాడు.ఈ క్రమంలో ఎదురుగా వేగంగా ఓ వ్యాన్ రావడంతో ఆ కుర్రాడు తన ట్రక్ ను అదుపుచేయలేక డీ కొట్టేశాడు.
దాంతో ఒక్క సారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.ఈ ఘటనలో ట్రక్ కు ఎదురుగా వస్తున్న వ్యాన్ లో ఉన్న న్యూ మెక్సికో కి చెందిన గోల్ఫ్ జట్టులోని ఆరుగురు సభ్యులు ఉన్నారని, వారితో పాటు డ్రైవర్ కూడా ఘటనా స్థలంలోనే మృతి చెందారని తెలుస్తోంది.
ఈ వ్యాన్ లోనే ఉన్న మరో నలుగురిని ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.అంతేకాదు