దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.అసలు ఈ సినిమా ప్రకటించినప్పుడు అంతా షాక్ అయ్యారు.
ఇద్దరు స్టార్ హీరోలను జక్కన్న ఏమాత్రం అటు ఇటుగా చూపించిన ఫ్యాన్స్ వార్ తప్పదని అంతా భావించారు.
కానీ రాజమౌళి ఈ స్టార్ హీరోలను హ్యాండిల్ చేసిన విధానం ఫ్యాన్స్ కు కూడా బాగా నచ్చింది.
వీరిద్దరిలో ఒకరి పాత్ర ఎక్కువ ఒకరిది తక్కువ కాకుండా ఇద్దరినీ సమానంగా చూపించి ఎక్కడ తప్పుపట్టకుండా ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది.
ఇక ఎట్టకేలకు మార్చి 25న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా మరొక 8 రోజుల్లో రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసాడు.స్పెషల్ ఇంటర్వ్యూలు చేస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నారు.
ఒక ఈవెంట్ దుబాయ్ లో ప్లాన్ చేస్తే, మరొక ఈవెంట్ బెంగుళూరు లో ఇంకో ఈవెంట్ హైదరాబాద్ లో చేయడానికి కూడా భారీ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ నెల 19న చిక్బల్లాపూర్ లో ఒక ప్రొమోషనల్ ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ కు ఏకంగా ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది.ఆర్ ఆర్ ఆర్ ఈవెంట్ కు కర్ణాటక సీఎం ను రంగంలోకి దింపుతున్నారు.ఈయన తో పాటు హెల్త్ మినిష్టర్, సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా అతిథులుగా హాజరవబోతున్నారు.
ఈ ఈవెంట్ ను దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు అంకితం ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.