టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కు సిద్దం అయ్యింది.సినిమాను చాలా విభిన్నంగా ప్రమోట్ చేస్తూ అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నారు.
తాజా గా చిత్ర దర్శకుడు రాజమౌళి.హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఇంటర్వ్యూ చేశాడు.
చాలా సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.పెద్ద ఎత్తున సినిమా గురించిన విషయాల ను ఆయన హీరో లు మరియు దర్శకుడి నుండి రాబట్టే ప్రయత్నం చేశాడు.
ఇక సరదాగా టాస్క్ లను కూడా ఇవ్వడం ద్వారా అందరి దృష్టి ని ఆకర్షించాడు.
సినిమా గురించి ఒక అతి పెద్ద రహస్యం ను చెప్పమంటూ అనీల్ రావిపూడి అడిగిన ప్రశ్న కు రాజమౌళి సమాధానం చెప్ప లేదు.దాంతో సమాధానం కు బదులు గా ఒక టాస్క్ చేయమని అన్నాడు.అందు కోసం నాటు నాటు డాన్స్ స్టెప్పు ను రాజమౌళి చేత చేయించారు.
రాజమౌళి కూర్చుని ఆ స్టెప్పును చేసే ప్రయత్నం చేశాడు.అయితే నిల్చుని చేయాలంటూ అనీల్ రిక్వెస్ట్ చేసిన సమయంలో ఎన్టీఆర్ స్పందిస్తూ సినిమా హిట్ అయిన తర్వాత ఖచ్చితంగా నాటు నాటు స్టెప్పు ను రాజమౌళి తో చేయిస్తాను అంటూ ఎన్టీఆర్ హామీ ఇచ్చాడు.
ఆ సమయం లో రాజమౌళి కూడా తప్పకుండా సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత ఆ స్టెప్పు వేస్తాను అంటూ హామీ ఇచ్చాడు.జక్కన్న దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ లో ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది.
కాని ఆమె ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం చర్చనీయాంశం గా మారింది.