రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేసినట్లుగా ఇటీవల రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు.ఇక ఈ సినిమాలో హీరోలు గా నటించిన చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఎంత పారితోషికం తీసుకున్నారు అనే విషయంలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.ఒక్కో హీరో రూ.50 కోట్లు అని కొందరు అంటే మరి కొందరు మాత్రం ఒక్కో హీరో అరవై కోట్లు తీసుకున్నారు అని రకరకాలుగా మీడియాలో ప్రచారం జరిగింది.కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కు ఇద్దరు హీరోలు కలిసి రూ.130 కోట్ల పారితోషికం ను తీసుకున్నారని తెలుస్తోంది.
సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేశాడు.రాజమౌళి మరియు ఇద్దరు హీరోలు చరణ్ ఎన్టీఆర్ లు కలిసి ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఆ సందర్భంగా ఈ సినిమా కు మీరు ఎంత పారితోషికం తీసుకున్నారు అంటూ చరణ్ ను ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకు సమాధానం దాట వేశారు.అదే సమయం లో రామ్ చరణ్ మాట్లాడుతూ పారితోషికం గురించి మాట్లాడింది ఎన్టీఆర్.
కనుక ఈ విషయాన్ని ఆయన్ని అడిగితే కరెక్ట్ గా ఉంటుందని సరదాగా నవ్వేశాడు.రామ్ చరణ్ పారితోషికం ను ఎన్టీఆర్ మాట్లాడటం ఏంటి అనుకుంటున్నారా.
అసలు విషయం ఏంటీ అంటే సినిమా కమిట్ అయిన సమయంలో మొదట మాట్లాడినప్పుడు ఎన్టీఆర్ ఎంత తీసుకుంటే అంత అన్నట్లుగా రామ్ చరణ్ అన్నాడట.అందుకే నీ పారితోషికం మాట్లాడితే అదే విధంగా నాకు కూడా కావాలి అంటే ఎన్టీఆర్ తో దానయ్య చర్చలు జరిపాడు.
అలా ఎన్టీఆర్ పారితోషికం ను మాట్లాడాడు అంటూ రామ్ చరణ్ తెలియజేశాడు.వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగానే ఇద్దరూ ఒకే పారితోషికాన్ని తీసుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది.
రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ చాలా సీనియర్ అయినా కూడా ఇద్దరు సేమ్ పారితోషికాలు అందుకున్నారని టాక్ వినిపిస్తుంది.