తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తన యాంకరింగ్ తో చలాకీ మాటలతో చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటుంది.
ఎప్పుడూ నవ్వుతూ సరదాగా సందడి సందడి చేస్తూ ఉంటుంది.ఇక తెలుగు ఫిమేల్ యాంకర్ లలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లాస్య పెళ్లి తర్వాత కొద్ది రోజులపాటు ఇండస్ట్రీకి దూరం అయ్యింది.
ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది.ఇక పోతే యూట్యూబ్ లో సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించిన లాస్య యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు చేస్తూ తన అభిమానులకు చేరువగా ఉంటోంది.
ఇటీవలే యూట్యూబ్ ఛానల్ లో తన అత్తారింటిని చూపించిన లాస్య తాజాగా తన అన్నయ్యకు బైక్ లో గిఫ్ట్ గా ఇచ్చింది.ఈ మేరకు యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోను కూడా విడుదల చేసింది లాస్య.
ఆ వీడియోలో లాస్య మాట్లాడుతూ.తన అన్నయ్య ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ స్కూటీ ని వాడుతున్నారని, తన అన్నయ్య కోసం ఒక కొత్త బైక్ ను గిఫ్ట్ గా అనుకుంటున్నట్టు తెలిపింది.
ఇక లాస్య ఆర్డర్ చేసిన మూడు నెలలకు డెలివరీ చేస్తామని తెలిపారట.దీనితో లాస్య అన్నయ్య బర్త్ డే నవంబర్ లో అయిపోగా లేటుగా ఇప్పుడు మేము గిఫ్ట్ ఇస్తున్నాము అని తెలిపింది లాస్య.
మొదట లాస్య ఎలక్ట్రికల్ స్కూటర్ ని బుక్ చేయగా తన అన్నయ్యకు యునికాన్ బైక్ నచ్చుతుంది అని తెలియడంతో రెండు బైక్లను కూడా బుక్ చేశారట.
అలా తన అన్నయ్యకు చెప్పకుండా కారులో ఎక్కించుకొని బైక్ పూర్తిగా తీసుకున్న తర్వాత ఆ బైక్ తనకే అని చెబుతూ వాళ్ళ అన్నయ్యను సర్ ప్రైజ్ చేసింది లాస్య.వాళ్ళ అన్నయ్య చేతికి తాళాలు ఇచ్చి బైక్ నీకే అని చెప్పడంతో వాళ్ళ అన్నయ్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు.ఈ ట్విస్ట్ నేను ఊహించలేదు అనే తెలిపాడు లాస్య అన్నయ్య.
ఈ బైక్ ధర దాదాపు లక్షన్నర రూపాయలు ఉంటుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన అన్నయ్యకు బైక్ కొనిచ్చిన లాస్యను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.భర్తకు కారు, నాన్నకు ట్రాక్టర్, ఇప్పుడు అన్నయ్యకు బైక్ గిఫ్ట్ ఇవ్వడం మామూలు విషయం కాదంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.