ఉత్తరాది ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ దెబ్బకు కాంగ్రెస్, బీజేపీ ఓడిపోయింది.కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లతో చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా మారింది.ఇక బీజేపీకి కండ్లు బైర్లు గమ్మే ఓట్లశాతం వచ్చింది.పంజాబ్ లో 117 అసెంబ్లీ సీట్లలో 92 సీట్లు ఆధిక్యంలో ఉంది.కాంగ్రెస్ 17 సీట్లలో ఆధిక్యంలో ఉంది.ఇంతటి ఘోర వైఫల్యానికి ప్రధాన కారణం నేతల మధ్యకీచులాటలేనని తెలుస్తోంది.
ఇదేమో తాను నిల్చున్న కొమ్మను తానే నరుక్కున్న చందంగా మారింది.ఈ సామెత కాంగ్రెస్‌కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది.
ఎందుకంటే అధికారంలో ఉండి కూడా ఓటమిని చవిచూడడం ఇందుకు కారణం.
అయితే పార్టీలోనూ ప్రభుత్వంలోను పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్ సిద్ధు చేసిన రచ్చ అంతాఇంతా కాదు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ ను సీఎంగా రాజానామా చేసేంత వరకు ర్యాగింగ్ చేసినంత పనిచేశాడు.ఆయన పోరు భరించలేక చివరికి కెప్టెన్ రాజీనామా చేసి పార్టీని కూడా వదిలేశాడు.
అనంతరం సీఎం అయిన చరణ్‌జిత్‌సింగ్ చన్నీని కూడా అతిగా వేధించాడు.అసలు అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చనే కనీస జ్ఞానం లేకుండా నేతల మధ్య వైరుధ్యాన్ని పెంచాడు.

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వివాదాలు చూసిన జనం విసిగి వేసారిపోయిన పరిస్థితి.దీంతో జరిగిన ఎన్నికల్లో ఓట్లు వేయలేదని, ఇక బీజేపీకి ఓట్లు వేయడం ఇష్టం లేక ఆప్‌కే పట్టం కట్టినట్టు సమాచారం.ఢిల్లీ మోడల్తో క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్న కేజ్రీవాల్‌కు జనాల్లో మంచి క్రేజ్ ఉంది.ఆప్ పంజాబ్ అధ్యక్షుడు భగవంత్ మాన్‌పై అభిమానంతో ప్రజలు ఆప్‌కు ఘన విజయం కట్టబెట్టారు.
ఇక తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న సిద్దు ఇక ర్యాగింగ్ చేసుకుంటూ ఐదేండ్ల పాటు కాలం గడపాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.