విడాకులపై నెటిజన్ పరోక్ష ప్రశ్న.. సమంత రిప్లై వైరల్

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Netizens Indirect Question On Divorce To Samantha Reply Vira Samantha, Tollywood-TeluguStop.com

ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాగే తమిళంలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ దక్షిణాది సినీ ఇండస్ట్రీలోని అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత దశాబ్ద కాలం నుంచి స్టార్ సెలబ్రిటీగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలోనే నాగచైతన్యను ప్రేమించడం పెళ్లి చేసుకోవడం అలాగే నాలుగు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడం అన్ని కూడా సమంత జీవితంలో ఎంతో తొందరగా జరిగిపోయాయి.

అయితే వీరి విడాకుల ప్రకటన తర్వాత సమంత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.కొద్ది రోజులపాటు ఈ విడాకుల బాధలో సమంత ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వకుండా పూర్తిగా తన స్నేహితులతో కలిసి తీర్థయాత్రలు చేయడం అలాగే విదేశీ పర్యటనలు చేస్తూ ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డారు.

ఈ విధంగా విడాకుల నుంచి బయట పడిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

Telugu Divorce, Netizens, Replay, Samantha, Tollywood-Movie

ఇదిలా ఉండగా ఒకవైపు ఎన్నో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా… మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ రోజురోజుకు ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నిత్యం ఏదో ఒక పోస్ట్ లేదా వీడియో ద్వారా ప్రేక్షకులను సందడి చేసే సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆస్క్ మీ యనీ థింగ్ అనే సెషన్ ప్రారంభించారు.ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు తన పై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ పరోక్షంగా సమంతను తన విడాకుల గురించి ప్రశ్నించారు.

Telugu Divorce, Netizens, Replay, Samantha, Tollywood-Movie

ఈ సందర్భంగా సదరు నెటిజెన్ ప్రస్తుతం మీరు ఓకేనా అంటూ…విడాకుల ప్రకటన తర్వాత ఆ డిప్రెషన్ నుంచి మీరు బయట పడినట్లేనా అంటూ తనని పరోక్షంగా అడిగారు.ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ ఇలా అడిగినందుకు చాలా కృతజ్ఞతలు.ప్రస్తుతం తాను బాగున్నానని సమంత సమాధానం తెలియజేశారు.

ఈ విధంగా సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి సినిమాపై అంచనాలను పెంచింది.అదేవిధంగా ప్రస్తుతం ఈమె యశోద అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube