ఆ ఒక్క రోజే ఆరు సినిమాలు.. పవన్ సినిమాకే ఇంత పోటీనా?

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ఈనెల 25వ తారీకున విడుదల కాబోతుంది.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది.

 Pawan Bheemla Nayak Release Date Clash , Bheemla Nayak , Film News , Gani Mov-TeluguStop.com

ఈనెల 18న ట్రైలర్ రాబోతుంది… ఇదే వారం చివర్లో ప్రీ రిలీజ్ ను కూడా ప్లాన్‌ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే విడుదల తేదీని ప్రకటించారు.

సినిమా ను ఫిబ్రవరి 25న విడుదల చేయాలని మొదటే అనుకున్నారు.కాని ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో క్లారిటీ రాకపోవడంతో విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది.

కాని అనూహ్యంగా పవన్ సినిమా 25వ తారీకునే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ విడుదల కాబోతున్న ఆ 25వ తారీకునే మెగా హీరో వరుణ్ నటించిన గని చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.భీమ్లా నాయక్‌ ను ప్రకటించాడనికి కొన్ని గంటల ముందే గని సినిమా ను 25వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.ఇక ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా తో కూడా శేర్వానంద్ రాబోతున్నాడు.

యంగ్ హీరో కిరణ్‌ నటించిన సెబాస్టియన్ ను కూడా 25వ తారీకున విడుదల చేయబోతున్నారు.ఇవి కాకుండా వాలిమై మరియు గంగూబాయ్ సినిమాలు కూడా డబ్బింగ్‌ అయ్యి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

కనుక 25వ తారీకున టాలీవుడ్‌ బాక్సాఫీస్ కళ కళలాడే అవకాశం ఉంది.ఈ సినిమాల్లో ఒకటి రెండు వెనక్కు తగ్గినా ఆశ్చర్యం లేదు.వాలిమై మరియు గంగూబాయ్ లు ఖచ్చితంగా వస్తాయి.భీమ్లా నాయక్ కు మరే సినిమా లు పోటీగా నిలుస్తాయి అనేది చూడాలి.

పవన్ భీమ్లా నాయక్ పై ఉన్న అంచనాల నేపథ్యంలో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube