సాధారణ మనుషులు హైరేంజ్ లో అప్‌డేట్ అయినప్పటికీ యాచకులు ఎప్పుడూ అలాగే ఉంటున్నారు.వినూత్నంగా ఆలోచన చేసే ఆసక్తి వారిలో అస్సలు కనిపించడం లేదు.
అయితే అదంతా గతం… ఇప్పుడు బిచ్చగాళ్లు కూడా అప్‌డేట్ అవుతూ అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నారు.మొన్నటిదాకా ట్రాఫిక్ సిగ్నల్స్, దేవాలయాల వద్ద యాచించిన ఈ బిచ్చగాళ్లు ఇప్పుడు ఏకంగా డిజిటల్ బాట పట్టారు.
వినడానికి ఇది ఆశ్చర్యంగా, ఫన్నీగా అనిపించినా ఇది అందరూ నమ్మాల్సిన నిజం.ఎందుకంటే అప్‌డేట్ అయిన బిచ్చగాళ్లు మన కళ్లముందు స్పష్టంగా కనిపిస్తున్నారు.పైన పిక్ లో ఒక బిచ్చగాడు తన మెడలో ఒక క్యూ ఆర్ కోడ్ వేసుకున్నట్లు కనిపిస్తుంది కదా! అలా ఫోన్ పై క్యూఆర్ కోడ్ వేసుకొని అతను వీధుల వెంట తిరుగుతున్నాడు.“చిల్లర లేదు.తర్వాత రా, పో!” అనేందుకు ఛాన్స్ లేకుండా ప్రజల దగ్గర ఆయన డిజిటల్ పద్ధతిలో బిచ్చమెత్తుకుంటున్నాడు.సింపుల్‌గా ఇతడిని సైబర్ బెగ్గర్ లేదా డిజిటల్ బెగ్గర్ అని పిలిచినా తప్పేం లేదేమో .
వివరాల్లోకి వెళితే… బిహార్ రాష్ట్రానికి చెందిన రాజు ప్రసాద్ అనే ఒక యాచకుడు ప్రతిరోజూ… “రూపాయి ధర్మం చేయండి అయ్యా.బాబు.” అంటూ అడుక్కునేవాడు.కానీ అందరూ కూడా “చిల్లర లేదమ్మా” అని సమాధానం చెప్పేవారు.
దీంతో సంకట స్థితిలో చిక్కుకుపోయి సతమతమైన సదరు బిచ్చగాడు రూపాయి పుట్టే మార్గం తెలియక ఆకలితో చాలా రోజులు అలమటించాడు.అప్పుడే డిజిటల్ పేమెంట్స్ గురించి తెలుసుకున్నాడు.
ఈ రోజుల్లో ఎవరూ కూడా జేబులో రూపాయి బిళ్లలు వేసుకొని తిరగడం లేదని, ప్రతి ఒక్కరూ గూగుల్ పే, ఫోన్ పే ద్వారానే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారని గ్రహించాడు.అందుకే అతను కూడా డిజిటల్ బాటపట్టాడు.మొదటిగా అతను పాన్ కార్డు సంపాదించి అనంతరం ఎస్బీఐ బ్యాంకులో ఒక అకౌంట్ తెరిచి దానికి మొబైల్ నంబర్ అనుసంధానం చేయించాడు.తర్వాత బ్యాంకు అధికారుల సహాయంతో యూపీఐ పేమెంట్స్ లింక్ ఏర్పాటు చేసుకున్నాడు.
ఆపై క్యూ ఆర్ కోడ్ క్రియేట్ చేయించుకున్నాడు.అలా క్రియేట్ చేయించుకున్న తర్వాత దాన్ని మెడలో వేసుకొని పశ్చిమ చంపారన్ జిల్లాలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ ల వద్ద బిచ్చమెత్తుకుంటున్నాడు.
అయితే అనూహ్యరీతిలో అప్డేట్ అయిన ఈ బిచ్చగాడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ ఐడియా అదిరిపోయిందని పొగిడేస్తున్నారు.
అలాగే ఎంతో కొంత సహాయం చేస్తూ అతడికి పూట గడిచేలా చేస్తున్నారు.