పసుపు.దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
వంటల్లో నిత్యం వాడే పసుపులో పోషకాలే కాదు ఔషధ గుణాలు సైతం మెండుగా ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా పసుపు బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తుంది.
వివిధ రకాల జబ్బులను నివారిస్తుంది.అలాగే చర్మ సౌందర్యానికి కూడా పసుపు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
అందుకే చాలా మంది సౌందర్య సాదనలో పుసుపును ఉపయోగిస్తుంటారు.అయితే చర్మానికి పసుపు వాడే క్రమంలో తప్పని సరిగా కొన్ని కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.
మరి ఆ జాగ్రత్తలు ఏంటీ.? పసుపు వాడేటప్పుడు వాటిని ఎందుకు తీసుకోవాలి.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖానికి పసుపుతో ప్యాక్ వేసుకున్న తర్వాత కొందరు సోప్‌తో ఫేస్ వాష్ చేసుకుంటారు.
కానీ, ఇకపై పొరపాటున కూడా అలా చేయకండి.పసుపు ప్యాక్ వేసుకున్న వెంటనే సోప్‌ను యూజ్ చేస్తే.
ప్యాక్ వల్ల ఎటు వంటి ప్రయోజనాలను పొందలేరు.అందు వల్ల, పసుపు వాడిన 24 గంటల తర్వాతే సోప్‌ను ఉపయోగించాలి.
అలాగే కొందరు పసుపును చర్మంపై ఎక్కువ సేపు ఉంచుకుంటే ఎక్కువ లాభాలు పొందొచ్చని నమ్ముతుంటారు.అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు.పైగా ముఖానికి పసుపును రాసి ఎక్కువ సేపు ఉంచితే.చర్మంపై పసుపు చారలు ఏర్పడి అందవిహీనంగా మారుతుంది.కాబట్టి, పసుపును చర్మంపై పదిహేను నిమిషాలకు మించి ఉంచకపోవడమే మంచిది.
ఇక చాలా మంది చర్మానికి ఏ పసుపు పడితే ఆ పసుపు వాడేస్తుంటారు.
ఇలా చేయడం వల్ల లేని పోని చర్మ సమస్యలను చేతులారా తెచ్చుకున్నట్లే అవుతుంది.అందు వల్ల ఇంట్లో పసుపు కొమ్ములతో తయారు చేసుకున్న పసుపునే చర్మానికి వాడాలి.
లేదు తాము తయారు చేసుకోలేము అనుకుంటే మార్కెట్లో ఆర్గానిక్ పసుపును కొనుగోలు చేసి ఉపయోగించినా మంచిదే.