ఇంగ్లాండ్ టీం పెట్టుకున్న ఆశలపై వెస్టిండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ నీళ్లు చల్లాడు.గెలుస్తుందని అనుకున్న మ్యాచ్‌లో ఇంగ్లీష్ ప్లేయర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు హోల్డర్!! అతడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 కీలకమైన ప్లేయర్లను పెవిలియన్ కు పంపించాడు.
అయితే ఈ ఐదు వికెట్లలో నాలుగు వికెట్లను ఒక్క చివరి ఓవర్‌లోనే పడగొట్టాడు.అది కూడా బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ప్లేయర్లకు ఝలక్ ఇచ్చాడు.
హోల్డర్ బౌలింగ్ లో ఒక్కసారిగా నాలుగు వికెట్లు కుప్పకూలడంతో ఇంగ్లాండ్ టీం 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది.అలా వెస్టిండీస్ ముందుంచిన 179 పరుగులు చేధించలేక ఇంగ్లాండ్ ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 17 పరుగుల తేడాతో చేజార్చుకుంది.
వెస్టిండీస్ కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన డిసైడింగ్ మ్యాచ్ లో ఈ అరుదైన ఫీట్ ను సాధించాడు హోల్డర్.ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ బౌలర్లు అయిన హోల్డర్ 5 వికెట్లు, అకేల్ హోసేన్ 4 వికెట్లు తీశారు.
దీంతో వీరిద్దరి వల్లే ఇంగ్లాండ్ ఆటగాళ్లలో చాలా మంది ఎక్కువ పరుగులు సాధించలేక ఔట్ అయిపోయారు.మొత్తం టీంలో కేవలం జేమ్స్ విన్స్ ఒక్కడే (55) హాఫ్ సెంచరీ చేయగలిగాడు.
బిల్లింగ్స్ 41 పరుగులతో 2వ స్కోరర్ గా నిలిచాడు.
రెండు ఇన్నింగ్స్ లో బాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 160-6 స్కోరుతో చివరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సి ఉంది.
అయితే ఒక బంతి మిగిలి ఉండగానే కేవలం 2 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఆ చివరి ఓవర్‌లో హోల్డర్ మొదట క్రిస్ జోర్డాన్ (7) క్యాచ్ ఔట్ చేశాడు.
ఆ వెంటనే శామ్ బిల్లింగ్స్ ను ఔట్ చేశాడు.తర్వాత వరుస బంతుల్లో ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్‌ల గోల్డెన్ డకౌట్ అయ్యారు.
ఇక వెస్టిండీస్ ఆటగాళ్లలో కెప్టెన్ పొలార్డ్ 41 పరుగులు చేయగా… రోవ్‌మన్ పావెల్ 35 పరుగులు… బ్రాండన్ కింగ్ 34 పరుగులు చేశారు.అయితే ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ రెండు అవార్డులు కూడా హోల్డర్‌నే వరించాయి.