పుష్ప సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు కావస్తున్న కూడా పుష్ప సినిమా క్రేజ్ ఇంకా తగ్గడం లేదు.ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమా పాటలు, డైలాగులు మార్మోగిపోతున్నాయి.
రోజు రోజుకి పుష్ప సినిమా క్రేజ్ ఇంకా పెరుగుతూనే ఉంది.ప్రేక్షకుల్లో ఇంకా పుష్ప సినిమా ఫీవర్ తగ్గినట్టు అనిపించడం లేదు.
పుష్ప సినిమాలోని పాటలను ఈ క్రియేట్ చేస్తూ వీడియోలను పోస్ట్ చేయడం, అదే విధంగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజాన్ని ఎవరికి నచ్చినట్టుగా వారు చేస్తున్నారు.ఇక సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇక ఆ సినిమాలోని పాటలు అయితే మరింత పాపులర్ అయ్యాయి.
కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా ఈ పాటలను రీ క్రియేట్ చేస్తున్నారు.
అలాగే వాణిజ్య సంస్థలు, హైదరాబాద్ పోలీసులు కూడా పుష్ప రాజ్ బీభత్సంగా ఉపయోగించుకుంటున్నారు.అందుకు ఉదాహరణగా ఇటీవలే ఒక కానిస్టేబుల్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటలు మరాఠి భాషలో పాడి అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.
ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.ఇదిలా ఉంటే తాజాగా సినిమాలోనే శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ డాన్స్ ని అనుకరిస్తూ ఒక డాన్స్ చేసాడో ఒక ఇంస్టాగ్రామ్.
అదికూడా ఒక రైల్వే ప్లాట్ఫామ్ పై.
ముంబై కీ చెందిన ధీరజ్ సనఫ్ అనే ఒక వ్యక్తి శ్రీవల్లి పాటలోని అల్లుఅర్జున్ హుక్ స్టెప్పును అనుకరిస్తూ వీడియో చేశాడు.ఈ నేపథ్యంలోనే అదే స్టెప్పులు వేస్తూ ముంబై లోకల్ ట్రైన్ లోకి వెళ్లడం, ఎస్కలేటర్ ఎక్కడం, ప్రజల మధ్య డాన్స్ చేయడం లాంటివి చేస్తూ ప్రేక్షకుల కు నవ్వులు తెప్పిస్తున్నాడు.అల్లు అర్జున్ మ్యానరిజంతో హుక్ స్టెప్పు వేస్తే ధీరజ్ అదే స్టెప్పును సరదాగా అనుకరిస్తూ వీడియో చేసి నెట్టింట్లో వదిలాడు.
ఇక ఇది చూసిన నెటిజన్స్ కామెంట్ రూపంలో మెచ్చుకుంటున్నారు.