ప్రపంచంలో చాలా రకాల పాములు ఉన్నాయి.వింతగా కనిపించే బనానా బాల్ పైథాన్‌తో సహా అనేక రకాల పాము జాతులపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ బనానా బాల్ కొండచిలువ చూసేందుకు అరటి పండులా ఉంటుంది.అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
దీని రంగు కూడా పసుపు రంగులో ఉంటుంది. ఇది ఒక ప్రత్యేక జాతి పాము.
రంగు, స్వభావం కారణంగా ఈ కొండ చిలువ ప్రత్యేకంగా నిలిచింది.ఈ పాము బాల్ పైథాన్ జాతికి చెందినది.
ఈ జాతికి చెందిన పాములు ఎక్కువగా నలుపు గోధుమ రంగులో ఉంటాయి. ఈ బనానా బాల్ కొండచిలువ వాటికి భిన్నంగా తెలుపు, పసుపు రంగులో ఉంటుంది.
అందుకే ఈ పాములను బనానా స్నేక్ అని కూడా పిలుస్తారు.వీటిలో అనేక రకాలు ఉంటాయి.
వీటిలో బనానా స్పైడర్, బనానా క్లౌన్, బనానా పాస్టెల్, బనానా సిన్నమోన్, బనానా మోర్వే, బనానా బ్లాక్ పిస్టల్ మొదలైనవి ఉన్నాయి.ఈ పాములను రాయల్ పైథాన్స్‌గా పరిగణిస్తారు, ఇవి పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని అడవులలో కనిపిస్తాయి.
ఇవి 20 నుండి 30 సంవత్సరాల వరకు జీవిస్తాయి.ఈ జాతికి చెందిన పాములు చాలా విషపూరితమైనవిగా గుర్తింపుపొందాయి.
ఇవి చాలా తక్కువ చురుకుదనం కలిగివుంటాయి.ఈ పాము ఎవరినైనా కాటేస్తే.
వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.