టాలీవుడ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన సీరత్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
ఇక ఈ సినిమాలో బుజ్జి మా బుజ్జి మా అనే సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమా విడుదలైన తర్వాత కొద్దిరోజుల పాటు ఎక్కడ చూసినా కూడా ఈ పాట మారుమోగిపోయింది.
ప్రేక్షకులకు ఈ పాట వినగానే సీరత్ కపూర్ గుర్తుకు వచ్చేది.ఆ పాట సీరత్ కపూర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక రన్ రాజా రన్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత ఆ రాజు గారి గది 2, కొలంబస్, టైగర్, టచ్ చేసి చూడు లాంటి సినిమాలలో నటించింది.
అయితే అడపాదడపా సినిమా చేసినా కూడా ఈ బ్యూటీకి తగిన గుర్తింపు దక్కలేదు.ఆ తరువాత ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు రాలేదు.
అయితే సినిమాల్లో నటించక పోయినా అప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.
అయితే రన్ రాజా సినిమా లో బొద్దుగా స్లిమ్ గా కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.
తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేసింది సీరత్ కపూర్.ఆ ఫోటోలో ఆమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.రన్ రాజా రన్ సినిమా లో బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బక్కచిక్కి పోయి సైజ్ జీరో లా తయారయింది.
ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఎందుకు ఇలా తయారు అయ్యావు అంటూ కామెంట్ చేస్తున్నారు.కొందరు ఈ ఫోటో పై పాజిటివ్ గా స్పందించగా, ఇంకొందరు నెగిటివ్ గా స్పందిస్తూ ఆ ఫోటో ఫై ట్రోలింగ్స్ చేస్తున్నారు.
సిరత్ కపూర్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.