ఉపాసన కొణిదెల. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.
మెగా కోడలుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజంలో చైతన్యం కలిగించే విషయాలు కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు తెల్పుతూ ప్రజలకు దగ్గరగా ఉంటుంది.
ఈమె సమాజంలో జరిగే విషయాలను మాత్రమే కాదు తన కుటుంబ విషయాలు కూడా ఎప్పటికప్పుడు మెగా అభిమానులతో పంచుకుంటారు.
అందుకే ఈమె అంటే మెగా అభిమానులకు చాలా ఇష్టం.ఆమె చేసే సేవా కార్యక్రమాలు కూడా ఆమెను ఉన్నత స్థానానికి చేరుకునేలా చేసాయి.
ఉపాసన ఇటీవలే ప్రధాని మోడీతో భేటీ అయ్యి అందరు ఈమె గురించే మాట్లాడుకునేలా చేసింది.
ఇక మరొకసారి మెగా కోడలు ఒక అరుదైన రికార్డ్ క్రియేట్ చేసి వార్తల్లో నిలిచింది.
ఆమె సాధించిన ఈ ఘనతను విన్న అందరు శభాష్ అని అనకుండా ఉండలేకపోతున్నారు.
ఉపాసన తాజాగా ఒక ఫోటో షేర్ చేసింది.సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేస్తూ తాను సాధించిన ఘనతను తెలిపింది.ఉపాసన ప్రపంచం లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘనతను సాధించింది.
దుబాయ్ గోల్డెన్ వీసా ను ఉపాసన దక్కించుకుని అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ విషయాన్నీ ఉపాసన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఆమెకు అందరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.నేను ఇండియా ఎక్స్ పో లో పాల్గొన్నందుకు అనుకుంటా ఈ క్రిస్టమస్ కు నాకు ఒక మంచి బహుమతి దక్కింది.వసుధైక కుటుంబం.ప్రపంచం మొత్తం ఒక కుటుంబం.యూఏఈ గోల్డెన్ వీసా పొందడం సంతోషంగా ఉంది.
అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన భారతీయురాలిని.అధికారికంగా ఇప్పుడు నేను గోల్డెన్ సిటిజెన్ ని అని చెప్పుకొచ్చింది ఉపాసన.