శాంతియుతంగా స్మశానవాటిక సాధన కోసం ఆందోళన చేస్తుంటే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో ఎలా పెడతారని టీ పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి పోలీసులను ప్రశ్నించారు.గురువారం కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డ స్మశానవాటిక సాధనకోసం స్మశాన వాటిక స్థలంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి దంపతులపై అకారణంగా దాడి చేసి తీవ్రంగా ఖండించారు.
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న కార్పొరేటర్ దంపతులను పరామర్శించారు.స్మశాన వాటిక సాధన కోసం స్మశానవాటికలో నిరాహార దీక్ష చేస్తుంటే శాంతిభద్రతలకు విఘాతం జరిగిందా అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వంపై తాము దాడి చేయలేదని పేద ప్రజలు నివసిస్తున్న 20 కాలనీలకు అవసరమైన స్మశానవాటిక సాధన కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్నామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్మశానవాటిక సాధన కోసం పోరాడుతామని అన్నారు.
ఈ విషయాన్ని టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతామని ఆయన ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఉదయం నుంచి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి దంపతులను కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, ఉప్పల్ అధ్యక్షుడు పరమేశ్వర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోగుల సరిత వెంకటేష్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి మెరుగు సునీత, దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పా రామారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏనుగు సంజీవరెడ్డి నాగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కొంపల్లి కౌన్సిలర్ జోస్నా శివారెడ్డి, జవహర్ నగర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.