కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పై కేసు నమోదు..!!

నిన్న రామతీర్థంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అదే రీతిలో మరికొంత మంది వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించటం తెలిసిందే.ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు.

 The Case Failed Against Ex Central Minister Ashokgajapati Raju Details,ycp, Asho-TeluguStop.com

కి వైసీపీ  క్యాడర్ కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఒక్కసారిగా అశోక్ గజపతి రాజు వైసీపీ నాయకులు పైకి వెళ్లడంతో వాళ్లు కూడా మీదకు రావడం తో తోపులాట జరిగింది.

అనంతరం పోలీసులు వచ్చి రెండు గ్రూపులను చెదర గొట్టారు.కాగా నేడు అశోక్ గజపతిరాజు పై కేసు నమోదు చేశారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది.

రామతీర్థంలో శంకుస్థాపనకు ఆటంకం కలిగించారని ఈవో ఫిర్యాదు చేయటంతో పోలీసులు అశోక్ గజపతిరాజు పై కేసు నమోదు చేశారు.

నిన్న రామతీర్థం బోడి కొండపై అశోక్ గజపతిరాజు ఆందోళన చేయటం తెలిసిందే.తనకు చెప్పకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని అశోక్ గజపతిరాజు ఆందోళనలు చేయడం జరిగింది.

ఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు 473, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.రామతీర్థం బోడి కొండపై నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Telugu Ap, Bodi Konda, Ramateertham, Vellampalli, Ycp-Political

ఆలయ ధర్మకర్త గా ఉన్నాను అశోక్ గజపతిరాజు తనకి తెలియకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని ఆందోళనకు దిగటంతో వైసీపీ క్యాడర్ కి ఆయనకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.విగ్రహాల ధ్వంసం చేసిన ఆధారాలు తారుమారు చేయాలని ప్రభుత్వం చూస్తున్నట్లు అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చేయడం జరిగింది.దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స ను అదే రీతిలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటైన కౌంటర్లు ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube