ఆసీన్. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్.
మలయాళ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగుహీరోల సరసన కూడా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది.
అంతేకాదు తన కోర చూపులతో కుర్రకారు మతి పోగొట్టింది అందం అభినయంతో ఎంతోమంది పగటి కలల్లోకి నెట్టింది .ఇలా తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ కేరళ కుట్టి తమిళంతో పాటు తెలుగులో కూడా ఎంతోమంది బడా హీరోల సరసన మెరిసింది.
ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరక్కేకిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.మొదటి సినిమాలో ఎంతో అమాయకంగా ఉండే అమ్మాయి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ ఒక్క మూవీతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఘర్షణ సినిమాతో తనకు తిరుగులేదని నిరూపించుకుంది.
అయితే దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈ అమ్మడు ఊహించని నిర్ణయం తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది.

ఎంతో బిజీగా ఉన్న సమయంలో మైక్రోమ్యాక్స్ సహవ్యవస్థాపకుడు రాహుల్ శర్మను 2016 లో వివాహం చేసుకుంది.ఆసిన్ వివాహం జరగడానికి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కారణం అని చెప్పాలి.బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఆసిన్ భర్త రాహుల్ స్నేహితులు.

అయితే అక్షయ్ కుమార్ మూవీ లో హీరోయిన్ ఆసిన్ నటించిన సమయంలో ఓ సినిమా ఫంక్షన్ కి రాహుల్ కూడా వచ్చాడు.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిపోవడంతో ఇక వీరి ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళింది.అంతేకాకుండా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తూ సినిమాలను వదులుకోవడం వల్లనే ఆసిన్ సినీ కెరియర్ మొత్తం పాడైపోయింది అనే టాక్ కూడా ఉంది.