మద్యం తాగిన తర్వాత మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తమను తాము మర్చిపోయి మరీ ప్రవర్తిస్తుంటారు.
తాము ఏం చేస్తున్నామో కూడా వారికి తెలియదు.ఇక ఇలాంటి మందు బాబులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇప్పుడు కూడా ఇలాంటి వైరల్ వీడియోనే బాగా హల్ చల్ చేస్తోంది.దీన్ని చూసిన వారంతా కూడా ఇదేం పైత్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఎందుకంటే అతను మద్యం మత్తులో ఏకంగా అరటి చెట్టుతో ఫైటింగ్ చేస్తున్నాడు .మద్యం తాగిన వాళ్లు బైకులు నడిపినా లేదంటే కాలి నడకన నడుస్తున్నా కూడా కుదుటగా ఉండరు.ఎందుకంటే మితిమీరిన మత్తు వారిని ఒక చోట కుదురుగా ఉండనివ్వదు కదా.ఇక తాగిన తర్వాతే చాలా విషయాలు గుర్తుకు వస్తుంటాయి చాలామందికి.అందుకే వారు దేని మీదనో ఒకదాని మీద తమ ప్రతాపం చూపించేస్తారు.ఇప్పుడు వైరల్ గా మారిన వీడియోలో కూడా ఓ వ్యక్తి ఇలాగే తన కోపాన్ని చూపించాలనుకున్నాడు కాబోలు.వెంటనే ఓ చెట్టు దగ్గరకు వెల్లాడు.
అయితే అది చెట్టు అని తెలిసి వెళ్లాడో లేక మనిషి అనుకున్నాడో తెలియదు.కానీ అతను అరటి చెట్టు దగ్గరకు వెళ్లి గట్టిగా కొట్టడానికి ప్రయత్నిస్తాడు.కానీ అతను బ్యాలెన్స్ తప్పడంతో ఆ పంచ్ చెట్టుకు తాకదు.
అయినా సరే మనోడు మరోసారి అలాగే అరటిచెట్టుకి పంచ్‌లు వేసేందుకు ప్రయత్నిస్తుంటాడు.కానీ ప్రతిసారి కింద పడిపోవడం మనం ఇందులో చూడొచ్చు.
ఇక ఇతని వ్యవహారాన్ని మొత్తం అక్కడున్న వారు వీడియో తీయగా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.దీన్ని చూసిన వారంతా కూడా ఇదేం పని బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు.