టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మొట్ట మొదటిసారిగా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ క్రమంలోనే ఈ పాట సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రెండ్ అవుతూ విశేష ఆదరణ దక్కించుకుంది.
ఈ పాట విడుదలైన అతి తక్కువ సమయంలోనే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది.ఇదిలా ఉండగా ఈ పాట లిరిక్ మగవాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉందని, పాటలోని ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి.’ అనే లిరిక్స్ వివాదం రేపుతున్నాయి.ఈ క్రమంలోనే ఈ లిరిక్ ఆంధ్రప్రదేశ్లోని పురుష సంఘం కోర్టులో కేసు వేశారు.
ఇక ఈ పాటను మగవాళ్ళ పై వివక్షత చూపిస్తూ రాశారని రచయిత చంద్రబోస్ పై కూడా విమర్శలు చేశారు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఈ పాటకు వ్యతిరేకత రావడంతో ఈ పాట గురించి చంద్రబోస్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అదేవిధంగా మగవాళ్ల బుద్ధిని ఎంతో అద్భుతంగా చూపించారు అంటూ అమరావతిలోని మహిళలు సమంత చిత్రపటానికి రచయిత చంద్రబోస్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఇలా ఈ పాట పై పురుషులు, మహిళల మధ్య ఇలాంటి వివాదం నెలకొనగా తాజాగా ఈ పాటపై తమిళనాడులో కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది.
ఈ పాటలో మగవాళ్లను అవమానపరిచే విధంగా లిరిక్స్ ఉన్నాయంటూ తమిళనాడు పురుష సంఘం అధ్యక్షులు చిత్తూరు జిల్లాలోని కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో పాటను బ్యాన్ చేయకపోతే ఈ పాటలో డాన్స్ చేసిన సమంత పాట పాడిన ఆండ్రియా, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, గేయరచయిత వివేకాపై కేసు పెడతామని హెచ్చరించింది.
అయితే పుష్ప సినిమాలోని ఈ పాట అన్ని భాషలలో విశేషమైన ఆదరణ దక్కించుకోగా ఈ విధమైనటువంటి వివాదాలను కూడా సృష్టిస్తోంది.
తెలుగులో ఈ పాటను చంద్రబోస్ రాయగా తమిళంలో రచయిత వివేకా రచించారు.తమిళంలో ఈ పాట ఇప్పటికే 20 మిలియన్ వ్యూస్ ఉన్నప్పటికీ ఈ పాట కూడా వివాదానికి కారణం అయిందని చెప్పవచ్చు.అయితే ఈ పాట పై కేసు వేయడంతో కొందరు సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ ఇలా ప్రతి ఒక్క పాట పై కేసు వేసుకుంటూ వెళితే ఇండస్ట్రీలో పాటలు అనేవి ఉండవని వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
ఇక ఈ సినిమా నేను థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది.మొత్తానికి సమంత నటించిన ఒకే ఒక, మొట్టమొదటి ఐటమ్ సాంగ్ ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలబడింది.