వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న హీరో లక్ష్ చదలవాడ. వలయం సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ హీరో త్వరలోనే గ్యాంగ్ స్టర్ గంగ రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమా కి సంబంధించిన పాటలు ఇటీవలే విడుదల కాగా వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.త్వరలోనే ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.
అయితే మంచి కథలను ఎంచుకుంటూ విభిన్నమైన సినిమాలను చేస్తూ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న ఈ హీరో తాజాగా మరో సినిమా కు శ్రీకారం చుట్టారు.
విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సరికొత్త కథ తో తెరకెక్కుతున్న ఈ వినూత్నమైన సినిమా తొందరలోనే షూటింగ్ కు వెళ్లనుంది.
ప్రొడక్షన్ నంబర్ 12 గా చదలవాడ బ్రదర్స్ సమర్పణ లో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాని పద్మావతి చదలవాడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.కాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లోని ఆఫీస్ కార్యాలయం లో జరిగాయి.
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.