బిగ్ బాస్ సీజన్ 5 నుండి చివరి కంటెస్టంట్ గా 14వ వారం లో ఎలిమినేట్ అయిన కాజల్ బయటకు వచ్చాక వరుస ఇంటర్వ్యూస్ తో బిజీ బిజీగా గడుపుతుంది.టాప్ 5లో ఉండాల్సిన కాజల్ జస్ట్ వన్ వీక్ ముందు బయటకు రావాల్సి వచ్చింది.
అయితే బయటకు వచ్చిన కాజల్ బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరన్నది చెప్పేస్తుంది.తన ఫ్రెండ్.
బ్రదర్ విజే సన్నీనే బిగ్ బాస్ 5 సీజన్ విన్నర్ అవుతాడని బల్లగుద్ధి చెబుతుంది కాజల్.హౌజ్ లో ఉన్నప్పుడే బయట ఆడియెన్స్ అంచనాలను కనిపెట్టేసిన కాజల్ బయటకు వచ్చాక సన్నీ విన్నింగ్ కంపల్సరీ అనేస్తుంది.
ఓ పక్క పోటీలో షణ్ముఖ్ ఉన్నా ఈసారి ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ కు టైటిల్ దక్కనివ్వకూడదు అని కామన్ ఆడియెన్స్ కూడా ఫిక్స్ అయ్యారు.అందుకే హౌజ్ లోకి రాకముందు ఎవరో కూడా తెలియని సన్నీ కోసం అంతా ఫైట్ చేస్తున్నారు.
ఓట్ చేస్తున్నారు.బయటకు వచ్చిన కాజల్ కూడా తన గ్రూప్ కు సపోర్ట్ గా అందరి చేత సన్నీ విన్నర్ అయ్యేలా ఓట్ వేయించే అవకాశం ఉంది.
మరి కాజల్ చెప్పినట్టు సన్నీ విన్నర్ అవుతాడా లేదా అన్నది చూడాలి.