ఏదైనా ఒక రంగంలో సక్సెస్ సాధించి పేరుప్రఖ్యాతలు సంపాదించుకోవడం సులభం కాదనే సంగతి తెలిసిందే.అయితే పాటల రచయితగా తన ప్రతిభతో సిరివెన్నెల సీతారామశాస్త్రి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ఎవరైనా తాము ఎంచుకున్న రంగంలో విజయాలను అందుకోవాలంటే జీవిత భాగస్వామి సహాయసహకారాలు ఎంతో అవసరం.కెరీర్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భార్య సహాయసహకారాలు ఉంటే వాటిని సులభంగా అధిగమించవచ్చు.
ఒక సందర్భంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తన భార్య గురించి చెబుతూ పద్మలాంటి వైఫ్ దొరకడం తన లక్ అని చెప్పుకొచ్చారు.తనను, తన కుటుంబంను చూసుకోవడం కోసం, అందరి బాధ్యతలను నిర్వర్తించడం కోసం పద్మ చాలా ఆనందాలను కోల్పోయారని సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పుకొచ్చారు.
భార్య నాకు బెటర్ హాఫ్ మాత్రమే కాదని బెటర్ త్రీ ఫోర్త్ అని సిరివెన్నెల సీతారామశాస్త్రి వెల్లడించారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి భార్య పద్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త ఇంటి బాధ్యతలలో ఎప్పుడూ జోక్యం చేసుకునేవారు కాదని తెలిపారు.అత్తగారి సలహాలను వింటూ అన్నీ తాను చూసుకునేదానినని సిరివెన్నెల సీతారామశాస్త్రి భార్య పద్మ వెల్లడించారు.తన భర్త ఎప్పుడూ ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటారని లేదా ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేవారని పద్మ కామెంట్లు చేశారు.
తన భర్త రాసిన ప్రతి పాటకు మొదటి శ్రోతను తానేనని ఆమె తెలిపారు.
భర్త రాసిన పాటలతో తాను ఒక లైబ్రరీనే ఏర్పాటు చేశానని పద్మ వెల్లడించారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్త విని తట్టుకోలేక పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మీడియా ఎదుట కంటతడి పెట్టుకున్నారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి తన సినీ కెరీర్ లో అన్ని రకాల పాటలను రాశారు.
ఆ పాటలలో చాలా పాటలు ఆయన ప్రతిభకు అద్దం పడతాయి.