కొందరు అంతే.ఏం జరిగినా సరే తమకేంటి అన్నట్టు తమ పని తాము చేసుకుంటూ పోతారు.
ఇలాంటి వారినే కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్ గా పిలుస్తుంటాము.ఇలాంటి వారు చాలా డేంజర్ అండి.
ఎందుకంటే ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా సరే పెద్దగా పట్టించుకోరు.తమకేమైనా లాభం చేకూరు అంశాన్ని అయితేనే పట్టించుకుంటారు.
అంతే తప్ప ఎవరికి ఏమైనా సరే మాకేంటి అన్నట్టు ఉంటారు.ఇలాంటి వారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది కాబోలు.
అయితే ఇప్పుడు ఇలాంటి ఓ ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం.
ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే మాత్రం నిజంగానే మీరు షాక్ అయిపోతారు.
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతారు కావచ్చు.సాధారణంగా మన చుట్టూ ఏదైనా ప్రమాదం జరుగుతోంది అంటేనే మనం చేసే పనిని పక్కన పెట్టేసి మరీ అందులో ఎవరూ గాయపడకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తుంటాం.
అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఇద్దరు మాత్రం బయట ఎంత పెద్ద ప్రమాదం జరుగుతున్నా సరే తమ ప్లేట్లో ఉన్న చికెన్ ను మాత్రం విడిచిపెట్టకుండా లాగించేస్తున్నారు.ఇదే అందరికీ షాక్ ఇస్తోంది.
ఈ వైరల్ వీడియోలో ఓ ఫంక్షన్ హాల్‌లో పెద్ద ఎత్తున మంటలు అంటుకుంటున్నాయి.దీంతో ఇక్కడున్న వారంతా తమ ప్లేట్లను అక్కడే విడిచి పెట్టి మరీ బయటకు పరుగులు తీశారు.బయట ఎవరికైనా ప్రమాదం జరుగుతుందో అని తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.అయితే ఓ ఇద్దరు మాత్రం తమకేమీ పట్టదన్నట్టు తింటూనే ఉన్నారు.ఎంత పెద్దగా మంటలు ఎగిసి పడుతున్నా సరే మాకేంటి అన్నట్టు చికెన్‌ను లాగించేస్తున్నారు.ఇదంతా అక్కడున్న వారు ఫోన్‌లో చిత్రీకరించి నెట్టింట పోస్టు చేయగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.