ఆ అలవాటే సిరివెన్నెల ప్రాణం తీసిందా.. గతంలో ఆయన ఏం చెప్పారంటే?

ప్రముఖ టాలీవుడ్ గేయ రచయితలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఒకరనే సంగతి తెలిసిందే.ఊపిరితిత్తుల సమస్య వల్ల సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న కన్నుమూశారు.

అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి క్యాన్సర్ బారిన పడటానికి ఆయనకు ఉన్న సిగరెట్ అలవాటే కారణమని సమాచారం.గతంలో ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తన స్మోకింగ్ హ్యాబిట్ గురించి చెప్పుకొచ్చారు.

మొదట తాను సరదాగా స్మోకింగ్ ను మొదలుపెట్టానని ఆ తర్వాత ఆ అలవాటు తనకు వ్యసనంగా మారిందని సిరివెన్నెల చెప్పుకొచ్చారు.నాకు అహంకారం ఎక్కువని అయితే సిగరెట్ ముందు మాత్రం తాను తల వంచుతానని సిరివెన్నెల పేర్కొన్నారు.

తన పిల్లలకు కూడా సిగరెట్ కు సంబంధించి తాను ఇదే విషయాన్ని చెప్పానని సిరివెన్నెల అన్నారు.అయితే తనకు సిగరెట్ తాగే అలవాటు ఉన్నా కొన్ని నియమనిబంధనలు పాటిస్తానని ఆయన అన్నారు.

Advertisement

చిన్నపిల్లల ముందు కానీ పబ్లిక్ తిరిగే ప్రదేశాల్లో కానీ సిగరెట్ తాగకూడదని నియమనిబంధనలు విధించుకున్నానని సిరివెన్నెల వెల్లడించారు.లంగ్స్ క్యాన్సర్ తో సిరివెన్నెల మరణించిన నేపథ్యంలో ఆయన గతంలో చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు.

మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు జరుగుతాయని సిరివెన్నెల సీతారామశాస్త్రి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకొచ్చారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటే ప్రాణంగా బ్రతికిన గొప్ప రచయిత.సిరివెన్నెల మరణం నమ్మలేని నిజమని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.సిరివెన్నెల మరణించిన రోజు సాహిత్యానికి చీకటి రోజు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సిరివెన్నెల కథా రచయితగా కూడా మెప్పించాలని ప్రయత్నం చేశారు.అయితే ఆయన రాసిన రచనలలో కొన్ని మాత్రమే ప్రచురితం కావడం గమనార్హం.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇండస్ట్రీలోకి సిరివెన్నెల ఎంట్రీ ఇచ్చిన కొత్తలో మాటలు రాయమని ఆయనను కోరినా ఆయన మాత్రం అందుకు అంగీకరించలేదు.గతంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పిన మాటలను తలచుకుంటూ సిరివెన్నెలను అభిమానించే ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు