మన దైనందిన ఆహారంలో గుడ్డుకు ప్రథమ స్థానం ఉంటుంది.గుడ్డు తింటే ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే.
ఉడక బెట్టిన గుడ్డు తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయి.ఇక గుడ్డును అనేక రకాలుగా వండుకుని తినొచ్చు.
చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారి దాకా అందరూ ఎంతో ఇష్టంగా తినేది కేవలం గుడ్డును మాత్రమే.అయితే గుడ్డు చుట్టు ఎన్నో ప్రవ్నలు ఉన్నాయండోయ్.
ఇంతకు ముందు కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న ప్రపంచాన్ని ఊపేసింది.కాగా దీనికి రీసెంట్ గానే సైంటిస్టులు సమాధానాన్ని కనుగొన్నారు.
అయితే మనం రెగ్యులర్ గా తినే గుడ్డు శాఖా హారమా లేక మాంసా హారమా అంటే చెప్పడం చాలా కష్టం.మన సమాజంలో దీన్ని కొందరు శాకాహారంగా భావిస్తారు.
ఇంకొందరు మాంసాహారంగా భావిస్తారు.ఇలా ఎన్నో ఏండ్లుగా ఉన్న ఈ ప్రశ్నను ఇప్పుడు సైంటిస్టులు చేదించారు.
దీనికి సమాధానం కనుగొన్నారు.అమెరికాకు చెందిన సైంటిస్టులు గుడ్డు మీద ఎన్నో రకాల ప్రయోగాలు చేసి చివరకు ఇది శాఖా హారమే అని తేల్చేశారు.
ఇందుకు వారు కొన్ని కారణాలను కూడా చెబుతున్నారండోయ్.మనకు సాధారణంగా మార్కెట్లో కొన్ని గుడ్లు దొరుకుతాయి.

వాటి మీద అన్‌ఫెర్టిలైజర్ అని రాస్తారు.ఎందుకంటే వాటి నుంచి కోడిపిల్లలు ఉత్పత్తి కావన్న మాట.అందుకే దీన్ని శాకాహారంగా భావించాలని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు.అలాగే గుడ్డులో ఉండే తెల్లని భాగంలో ప్రొటీన్లు ఉంటాయి కాబట్టి ఎలాంటి జంతు పదార్థం ఉండదని అందుకే దీన్ని ఎగ్‌వైట్ శాకాహారమని పిలవాలంటున్నారు.
ఇలా వారు అత్యంత శాస్త్రీయ పరమైన కారణాలను చెప్పి చివరకు గుడ్డును శాకాహారంగా మార్చేశారు.ఇక ఈ వార్త ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.దీన్ని చూసిన వారంతా శాఖాహారులు దీన్ని తినొచ్చన్న మాట అని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.