మర్రి చెట్టు.సిటీల్లో ఇవి కనిపించడం కష్టమే.
కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మర్రి చెట్లు ఎక్కడ పడితే అక్కడ కనివిందు చేస్తుంటాయి.ఈ చెట్టు ఆకుల నుంచి వేర్ల వరకు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
అందుకే ఆయుర్వేదం వైద్యంలో మర్రి చెట్టు ఆకులు, వేర్లు, బెరడు తదితర వాటిని విరి విరిగా ఉపయోగిస్తుంటారు.ముఖ్యంగా మర్రి చెట్టు ఆకులతో అనేక లాభాలను పొందొచ్చు.
ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు, కేశ సంరక్షణకు సైతం ఉపయోగపడతాయి.మరి లేటెందుకు మర్రి చెట్టు ఆకులు ఏయే విధంగా ఉపయోగపడతాయో చూసేయండి.
కొన్ని లేత మర్రి చెట్టు ఆకులను తీసుకుని బాగా ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్‌లో ఒక స్పూన్ మర్రి చెట్టు ఆకుల పొడి వేసి బాగా మరిగించాలి.
నీరు సగం అయ్యే వరకు హీట్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్‌ను గోరు వెచ్చగా అయిన తర్వాత తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పితో పాటు శ్వాస సంబంధిత సమస్యలు సైతం పోతాయి.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.పైల్స్ సమస్య దూరం అవుతుంది.మరియు శరీరంలోని మలినాలు బయటకు పోతాయి.

అలాగే ఒక కప్పు ఆవ నూనెలో మూడు లేదా నాలుగు స్పూన్ల మర్రి చెట్టు ఆకుల రసం వేసి వేడి చేయాలి.ఆపై ఈ నూనెను జుట్టుకు పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తల స్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు ఊడటం, చిట్లడం, తెగిపోవడం వంటివి తగ్గుతాయి.
ఇక ఒక బౌల్‌లో స్పూన్ ఎండ బెట్టుకున్న మర్రి చెట్టు ఆకుల పొడి, ఒక స్పూన్ ఎర్ర కంది పప్పు పొడి, రెండు స్పూన్ల పెరుగు మరియు కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకుని ముఖానికి పట్టించాలి.
ఇరవై నిమిషాల అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకుంటే.మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
స్కిన్ టోన్ పెరుగుతుంది.మరియు చర్మం కాంతి వంతంగా మారుతుంది.