ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో అమలు చేసే కొన్ని నిబంధనలు వింతగా విడ్డూరంగా అనిపిస్తుంటాయి.కానీ ఆ వింత నిబంధనల వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక నిబంధన కూడా ఆ కోవకు చెందిందే.అంటార్కిటికాలోని కింగ్‌జార్జ్ ఐలాండ్‌లో ఒక గ్రామంలో నివసించాలంటే శరీరంలోని ఒక భాగాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించుకోవాలి.
ఆశ్చర్య పోయారు కదా! మరి ఆ గ్రామ విశేషాలు ఏంటి? శరీరంలోని ఒక భాగాన్ని తొలగించాలనే విచిత్రమైన నిబంధన ఎందుకు పెట్టారు? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మనందరి శరీరంలో ఉండుకము లేదా అపెండిక్స్ అనే అవశేషావయవం ఉంటుంది.
అపెండిక్స్ హెల్దీ బ్యాక్టీరియాకి స్టోర్‌హౌస్‌గా పనిచేస్తుంది.ఇది డయేరియా జబ్బు తర్వాత జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని ఒక వైద్య సిద్ధాంతం చెబుతుంది.
అయితే వైద్య నిపుణులు మాత్రం ఇది పనికిరాని ఓ అవశేషమని చెబుతుంటారు.ఇది లేకుండా సాధారణ జీవితం కొనసాగించవచ్చని చాలామంది నిరూపించారు.
అయితే పాశ్చాత్య దేశాల్లో అపెండిక్స్ ఇన్‌ఫెక్షన్ సోకి ప్రాణాపాయ స్థితికి చేరుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా ఎక్కువే.
సుదూర ప్రాంతాల్లో నివసించే వారికి ఈ సమస్య వస్తే ఇక ప్రాణాలపై ఆశలు వదిలించుకోవడమే.విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ అనే గ్రామం కూడా పట్టడానికి చాలా సుదూర ప్రాంతంలో ఉంటుంది.

ఈ ఊర్లో 150 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు.ఈ గ్రామంలో బ్యాంకు, పోస్టాఫీసు, రెండు హాస్పిటల్స్ లాంటి ప్రాథమిక వసతులు అన్నీ ఉన్నాయి.కానీ ఏదైనా సీరియస్ సమస్య వస్తే మాత్రం ఆస్పత్రికి వెళ్లాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.ఈ ప్రాంతం నుంచి సిటీకి వెళ్లాలంటే మంచుతో కప్పబడిన రోడ్డు ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది.
ఆ ప్రయాణం సమయంలోనే గతంలో చాలా మంది చనిపోయారు.దాంతో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే ఉండుకాన్ని ఆ గ్రామస్తులు ఆపరేషన్ ద్వారా తీయించుకున్నారు.
అలాగే కొత్తగా గ్రామాల్లో అడుగుపెట్టే వారు కూడా అపెండిక్స్ శస్త్ర చికిత్స ద్వారా తొలగించుకోవాలనే ఒక నిబంధన పెట్టారు.సో, అదన్నమాట సంగతి!
.