అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప.రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
తెలుగు కమెడియన్ సునీల్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.జబర్దస్త్ అనసూయ ఈ సినిమా లో దాక్షాయణీ గా కనిపించబోతుంది.
అద్భుతమైన ఆమె మేకోవర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సినిమా పై అంచనాలను విపరీతంగా పెంచింది.అల్లు అర్జున్ వైవిధ్య భరితమైన లుక్ మరియు ఇతర నటీ నటుల పోస్టర్స్ సినిమా కు మరింత హైలైట్ గా నిలబడి సినిమా సూపర్ హిట్ లో కీలకంగా మారుతాయని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.
ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
గత రెండు మూడు రోజులుగా ఈ సినిమాను వాయిదా వేసినట్లు సోషల్ మీడియా లో పుకార్లు షికార్లు చేయడం మొదలైంది.
కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సినిమా ఇంకా పూర్తి కాలేదని సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించాల్సి ఉందని అందుకే సినిమాను నెల రోజులు వాయిదా వేయాలని కుంటున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.జనవరి చివరి వారం లో సినిమా ను విడుదల చేసేలా ప్లాన్ చేశారని కూడా వార్తలు వచ్చాయి.

కానీ ఆ వార్తలు ఏమాత్రం నిజం కాదు సినిమా ఖచ్చితంగా అనుకున్న తేదీకి వస్తుందని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు మరోసారి అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది షూటింగ్ పూర్తయింది.సమంత ఐటమ్ సాంగ్ ని కూడా ముగించినట్లు గా మైత్రి వారు చెప్పుకొచ్చారు.సినిమా ఆగే ప్రసక్తే లేదంటూ మరోసారి అభిమానులకు ధీమాగా చెప్పడంతో ఇండస్ట్రీ వర్గాల్లో కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అని తేలిపోయింది.
పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.