బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులను అంచనా వేయడం చాలా కష్టం.ఏ కంటెస్టెంట్ ఎప్పుడు ఎలా మారతారు చెప్పడం చాలా కష్టమైన పని.
ఎందుకంటే అప్పటి వరకూ బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉన్నవారు బద్ధ శత్రువులుగా కూడా మారిపోవచ్చు.అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఉన్న షణ్ముఖ్ జస్వంత్, సిరి లు పైకి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నప్పటికీ వారి మధ్య బంధం మరింత బలపడుతుంది.
ఇదే విషయాన్ని సిరి స్వయంగా ఒప్పుకుంది.
ఈ క్రమంలోనే తప్పు అని తెలిసినా కూడా కనెక్షన్ పెరుగుతుంది అంటూ సిరి తన మనసులో మాటను బయట పెట్టేసింది.
హౌస్ లో వీరిద్దరూ హద్దుమీరి హగ్గులు ఇచ్చుకోవడం ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఏమాత్రం నచ్చడం లేదు.అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జెస్సి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా జెస్సి మాట్లాడుతూ.బయట ప్రపంచంతో సంబంధం లేదు కాబట్టి హౌస్ మేట్స్ అక్కడి వాళ్లతో క్లోజ్ గా ఉంటారని, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అది కంటిన్యూ కాదని అభిప్రాయపడ్డాడు.