వామ్మో.. అల్లు అరవింద్ కాలేజ్ రోజుల్లో ఇన్ని అల్లరి పనులు చేశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే.గీతా ఆర్ట్స్, బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు తెరకెక్కాయి.

 Interesting Facts About Star Producer Allu Arvind Details, Allu Aravind, Star Pr-TeluguStop.com

అల్లు రామలింగయ్య కుమారుడైన అల్లు అరవింద్ కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రల్లో నటించారు.ఆహా పేరుతో అల్లు అరవింద్ ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించిన సినిమాల డిజిటల్ హక్కులను కొనుగోలు చేసి విడుదల చేస్తున్నారు.

పరిమిత సంఖ్యలో సినిమాలను నిర్మిస్తున్నా ఆ సినిమాలు విజయం సాధించే విధంగా అల్లు అరవింద్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే కాలేజ్ రోజుల్లో అల్లు అరవింద్ చాలా అల్లరి పనులు చేశారు.

సీనియర్ డైరెక్టర్ సాగర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అరవింద్, రవిరాజా పినిశెట్టి, మురళీ మోహన్ తనకు సీనియర్స్ అని తాను ఎనిమిదో తరగతి చదివే సమయంలో వాళ్లు పదో తరగతి చదివేవారని సాగర్ అన్నారు.

సినిమా ఇండస్ట్రీకి రాకముందే సినిమా వాళ్లతో పరిచయాలు ఉన్నాయని సాగర్ తెలిపారు.

అల్లు అరవింద్ కు తెలివి ఎక్కువని చదువు తక్కువైనా జ్ఞానం ఉందని సాగర్ పేర్కొన్నారు.

Telugu Aha Ott, Allu Aravind, Bus, Murali Mohan, Public Rowdy, Raviraja, Senior

కాలేజ్ లో స్టూడెంట్స్ స్పెషల్ అని గర్ల్స్ కు బస్సులు వేశారని ఆ బస్సుల్లో కేవలం అమ్మాయిలు మాత్రమే ఎక్కాలని కాలేజ్ గర్ల్స్ తప్ప వేరేవాళ్లు ఆ బస్ లో ఎక్కకూడదని అల్లు అరవింద్ బస్ కండక్టర్ ను, డ్రైవర్ ను దింపేసి ఆ బస్సు తోలుకుని వెళ్లాడని సాగర్ చెప్పుకొచ్చారు.

Telugu Aha Ott, Allu Aravind, Bus, Murali Mohan, Public Rowdy, Raviraja, Senior

ఆ వయస్సులో హీరోయిజంగా ఫీలై అల్లు అరవింద్ అలా చేశారని సాగర్ అన్నారు.తాను ఇదే ఎపిసోడ్ ను బాలచందర్ హీరోగా తెరకెక్కిన పబ్లిక్ రౌడీ అనే సినిమాలో పెట్టానని సాగర్ పేర్కొన్నారు.అల్లు అరవింద్ చేసిన అల్లరి పనుల గురించి తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube