గెలిచే ' ఛాన్స్ ' లేకపోయినా ..  దానిపైనే  బీజేపీ కాంగ్రెస్ ఆశలు ?

ప్రస్తుతం తెలంగాణ లో వెలువడిన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కు సంబంధించి టిఆర్ఎస్ లో సందడి వాతావరణం నెలకొంది.ప్రస్తుతం ఖాళీ అయిన అన్ని స్థానాల్లోనూ మళ్లీ టి ఆర్ ఎస్ కే గెలుపు ఛాన్స్ ఉంది.

 Bjp, Congress, Trs, Telangana, Telangana Mlc Elections, Mptc, Zptc, Sangareddy M-TeluguStop.com

ఈ మేరకు టిఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల్లో బలం ఉంది.  అయితే బిజెపి కాంగ్రెస్ పార్టీలు సైతం ఇప్పుడు పోటీకి సై అంటున్నాయి.

అసలు బిజెపి కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసినా,  గెలుపు అవకాశాలు ఉండవు అనే విషయం అందరికీ తెలిసిందే ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుండడం వెనుక కారణాలు చాలా ఉన్నాయట.తమకు గెలిచే సత్తా లేకపోయినా,  టిఆర్ఎస్ ప్రభుత్వం పై పెరిగిన వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని ఈ రెండు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి.

కాంగ్రెస్ 4 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది.

         మెదక్ స్థానం నుంచి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి  నిర్మల ను పోటీకి దించేందుకు సిద్ధమయ్యారు.

ఇదే విషయమై చర్చించేందుకు టిపిసిసి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు.మెదక్,  నల్గొండ, వరంగల్,  నిజామాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సిద్దమౌతుండగా కొన్నిచోట్ల బిజెపి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

నిజామాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండగా ఖమ్మం నుంచి నాగేశ్వరావు, వరంగల్ నుంచి వాసుదేవ రెడ్డి లను పోటీ చేయించాలని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈరోజు నామినేషన్ ప్రక్రియ కూడా ముగియనుండటంతో ,కాంగ్రెస్ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.

స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో మొత్తం 9917 ఓట్లు ఉన్నాయి.
   

Telugu Jagga, Mptc, Revanth Reddy, Sanga Mla, Ts Potics, Zptc-Telugu Political N

  ప్రస్తుతం ఓటర్లుగా ఉన్న వారిలో ఎక్కువ మంది పరిషత్ సభ్యులే.స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చి సర్పంచ్ తో సమానంగా ఎంపీటీసీలు ఉంటారనే విషయాన్ని ప్రచారం చేసింది.  అలాగే అభివృద్ధి విషయంలో ఎంపీటీసీ లను భాగస్వామి చేస్తామని చెప్పింది కానీ అది అమలు కాలేదు.

కాంగ్రెస్ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా మంది గెలిచారు. టిఆర్ఎస్ కు 70 శాతం మెజారిటీ ఉంది.అయితే ప్రభుత్వ వ్యతిరేకత, కొంత మంది టిఆర్ఎస్ స్థానిక సంస్థల నాయకుల్లో పెరిగిన అసంతృప్తి ఇవన్నీ కలిసి వస్తాయని కాంగ్రెస్ బిజెపిలు ఆశలు పెట్టుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube