నటుడిగా సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే నవరసాలను పలికించాలి.సమయానికి తగ్గట్లుగా వ్యవహరించాలి.
ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా చేయాలి.సమయపాలన పాటించాలి.
అప్పుడే నటుడిగా సినిమా రంగంలో రాణించగలుగుతారు .అలా రాణించగలిగిన వారిలో మేటి నటుడు కైకాల సత్యనారాయణ.ఆయన పేరు వినగానే ఎన్నో వందల సినిమాల్లో ఆయన నటించిన పాత్రలు కనిపిస్తాయి.అయితే ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఓవర్ నైట్ లో వచ్చినవి కాదు.
ఆయన ఎన్నో సంవత్సరాలు పడ్డ కష్టానికి ప్రతిరూపాలు.చిన్నప్పుడు తను చూసిన అక్కినేని నాటకాలే ఆయన సినిమాలోకి రావడానికి స్పూర్తిగా నిలిచాయి.
ఆ తర్వాత నెమ్మదిగా తను సినిమా రంగంలోకి అడుగు పెట్టి ఎన్నో శిఖరాలను అధిరోహించాడు.ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచాడు.
అప్పట్లో దర్శకుడు ఎల్వీ ప్రసాద్ కొత్త వారితో సినిమా ప్లాన్ చేశాడు.మద్రాసులో ఓ నెల రోజులు ఉండేలా ప్లాస్ చేస్తే.అవకాశం ఇస్తానని చెప్పాడు.దీంతో ఆయన మద్రాసుకు వెళ్లాడు.
తొలుత ఆయనలో నటుడిని గుర్తించింది ప్రసాద్.అదే సమయంలో తిల్ దర్శికత్వంలో ఎమ్మెల్యే అనే సినిమా చేశాడు.
అందులో అవకాశం వస్తుందనుకున్నా.చివరలో మిస్ అయ్యింది.
అదే సమయంలో నాగిరెడ్డి, కెవి రెడ్డి, చక్రపాణినిని కలిశాడు.వీళ్లంతా కైకాలలో మంచి నటుడు ఉన్నాడని గుర్తించారు.వారు డిఎల్ నారాయణ దగ్గరికి పంపించారు.ఆయన తన సినిమాలో కైకాలకు అవకాశం ఇస్తానని చెప్పాడు.అయితే మూడేండ్ల పాటు మరే సినిమాలో నటించకూడదు అనే కండీషన్ పెట్టాడు.దానికి ఒప్పుకుని ఓకే చెప్పాడు.

కైకాల హీరోగా, జమున హీరోయిన్ గా సిపాయి కూతురు అనే సినిమా మొదలు పెట్టారు.ఆయన నటనకు చాలా మంది ఫిదా అయ్యారు.కైకాలకు చాలా సినిమాల్లో అవకాశం వచ్చింది.కానీ వాటిని తన ఒప్పందం మూలంగా ఓకే చెయ్యలేదు.ఆ తర్వాత సినిమా పూర్తై.విడుదల అయ్యింది.
దీంతో తనకు వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి.అదే సమయంలో విఠలాచార్య రూపంలో మంచి అవకాశం వచ్చింది.
అయితే విలన్ పాత్ర వచ్చింది.అదే సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి సినిమాలో విలన్ పాత్రకు ఓకే అయ్యాడు.
ఆ తర్వాత కనకదుర్గ పూజా మహిమ సినిమాతో విలన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.ఈ సినిమా విడుదలై గొప్ప విజయం సాధించింది.
ఆ తర్వాత వెనుతిరిగి సూచుకోలేదు.సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, మదనకామరాజు కథ, అగ్గిపిడుగు లాంటి పలు సినిమాల్లో విలన్ గా చేసి మెప్పించాడు.
ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, క్రిష్ణతో పాటు తర్వాతి తరం నటుల సినిమాల్లోనూ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి ఈ తరం నటీనటులకు రోల్ మోడల్ గా నిలిచాడు.