అమెరికా అధ్యక్షురాలిగా భాద్యతలు స్వీకరించిన కమలా హారీస్...!!!

అమెరికా అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ కమలా హారీస్ భాద్యతలు స్వీకరించిన ఘటన అమెరికాలో రికార్డ్ సృష్టించింది.ఓ భారత సంతతి వ్యక్తి అమెరికా అధ్యక్షురాలిగా కాసేపు ఉండటం చరిత్రలో ఎన్నడూ జరగలేదని నిపుణులు అంటున్నారు.

 Kamala Harris Takes Over As President Of The United States , United States, Kama-TeluguStop.com

ఇది కమలా హారీస్ కు దక్కిన అరుదైన గౌరవమని భారతీయులు తెగ సంబరపడిపోతున్నారు.ఇంతకీ కమలా హారీస్ అధ్యక్షురాలిగా అవడం ఏంటి…అసలేం జరిగింది అనుకుంటున్నారా.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కు అనారోగ్యం కారణంగా అత్యవసర వైద్య చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

అయితే అధ్యక్షుడిగా ఉన్న బిడెన్ కు ప్రతీ సమయం ఎంతో విలువైనదే దాంతో ఆయన భాద్యతలను ఉపధ్యక్షురాలైన భారత సంతతి మహిళ కమలా హారీస్ కు సుమారు గంట 25 నిమిషాల పాటు బదిలీ చేశారు.

ఆరోగ్య పరీక్షలలో భాగంగానే కలనోస్కోపీ కోసం వైద్యులు ఆయనకు మత్తు మందు ఇవ్వనున్న నేపధ్యంలో కమలాకు ఆ కాసేపు అధికార భాద్యతలు అప్పగించారు బిడెన్.దాంతో ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షురాలిగా తొలి భారత సంతతి మహిళగా హిస్టరీ క్రియేట్ చేసిన కమలా ,అమెరికా చరిత్రలో అధ్యక్ష భాద్యతలు చేపట్టిన తొలి మహిళగా, అలాగే భారత సంతతి మహిళగా మరో రికార్డ్ సృష్టించారు.

Telugu America, Colonoscopy, Joe Biden, Kamala Harris-Telugu NRI

గతంలో అంటే బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇదే తరహా వైద్య పరీక్షల నిమిత్తం ఆయన భాద్యతలను అప్పటి ఉపాధ్యక్షుడిగా బదిలీ చేశారు.అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఏదైనా అత్యవసరమైన సమయంలో తన అధికారాలు కేవలం ఉపాధ్యక్షుడిగా మాత్రమే బదిలీ చేయవచ్చు అందుకు సర్వ హక్కులు అధ్యక్షుడికి ఉంటాయి.ఇదిలాఉంటే సుమారు గంట 25 నిమిషాలు అధ్యక్ష బాధ్యతలు కమలా హారీస్ చేపట్టడంతో భారత సంతతి అమెరికన్స్ సంతోషం వ్యక్తం చేశారు.కాగా బిడెన్ పై ట్రోల్స్ సైతం మొదలయ్యాయి.

ఇకపై కమలా హారీస్ అధ్యక్షురాలిగా ఉండబోతోందేమో బిడెన్ పని అంతేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube