ట్రంప్ కి ఎంత కష్టమొచ్చింది...అమ్మకానికి ట్రంప్ హోటల్...!!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితి చూస్తే జాలేస్తోంది.ఒకప్పుడు కింగ్ లా ఉన్న ట్రంప్ ఇప్పుడు ఒకపక్క ఆర్ధిక నష్టాలు, మరో పక్క రాజకీయంగా వ్యతిరేకత ఇలా రెంటికి చెడ్డ నావలా ఉంది పరిస్థితి.

 How Hard It Was For Trump , Trump Hotel For Sale , Trump, Donald Trump, Corona,-TeluguStop.com

కరోనా సమయం నుంచే ట్రంప్ ఆర్ధికంగా నష్టపోయారని వార్తలు వస్తూనే ఉన్నా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ నేడు ఏకంగా ట్రంప్ హోటల్ అమ్మకానికి పెట్టారని, బేరసారాలు జరుగుతున్నాయని, అతి త్వరలో ఓ బడా కంపెనీ ట్రంప్ హోటల్ ను దక్కించుకొబోతోందని వార్తలు రావడంతో అందరికి దృష్టి ట్రంప్ వైపుకు తిరిగింది.

కరోనా కారణంగా ట్రంప్ తన పదవిని పోగొట్టుకోవడమే కాదు వ్యాపారాలలో లాభాలు లేక ఎంతో నష్టపోయారు.

కరోనా సమయంలో హోటల్స్ మొదలుకొని అన్ని రంగాలు పతనమైన విషయం విధితమే, ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అన్నట్టుగా ఉంది అప్పటి పరిస్థితి.అయితే అదే సమయంలో ఎన్నికలు దగ్గరపడటం, కరోనా మృతులు, కేసులు సంఖ్య పెరగడంతో ట్రంప్ తన వ్యాపార వ్యవహారాలను పట్టించుకునే సమయం ఉండింది కాదు.

దాంతో అధ్యక్ష పదవి నుంచీ వైదొలగిన తరువాత ట్రంప్ అధిక సమయం వ్యాపారంపై పెట్టినా పెద్దగా ఫలితాలు ఇవ్వలేదట.దాంతో వాషింగ్టన్ డీసీ లో 263 విలాసవంతమైన గదులతో కూడిన ఓ అతిపెద్ద హోటల్ ను ట్రంప్ అమ్మేయనున్నాడని తెలుస్తోంది.

ఓ బడా పారిశ్రామిక వేత్త ట్రంప్ హోటల్ పై కన్నెశాడట.ఈ మేరకు భారీ డీల్ ను మధ్యవర్తులు కుదుర్చుతున్నట్లుగా తెలుస్తోంది.

దాంతో

ఈ డీల్ మొత్తం విలువ 380 మిలియన్ డాలర్లు పై మాటేనట.అయితే కరోనా సమయం మొదలు నేటి వరకూ ఈ హోటల్ దాదాపు 70 మిలియన్ డాలర్లు నష్టాన్ని చవిచూడటంతో హోటల్ ను వేరే సంస్థకు అప్పగించి ఈ నష్టం నుంచీ బయటపడాలని ట్రంప్ ఆలోచన చేస్తున్నట్లుగా వాల్ స్ట్రీట్ పత్రిక ఓ కధనాన్ని రాసుకొచ్చింది.

కాగా ట్రంప్ కొత్తగా మీడియా వ్యాపారంలోకి దిగనున్నట్లుగ తెలుస్తోంది.ఈ హోటల్ ను అమ్మిని తరువాత మీడియా రంగంలోకి ట్రంప్ దిగనున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube