ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరుతో రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారింది.తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ సీనియర్ లను కలసి అందరం కలిసి పనిచేద్దామని తెలపడం జరిగింది.
దీంతో కాంగ్రెస్ లో ఇక అంతర్గత పోరు ఉండదని అందరూ భావించారు .కానీ మరల యధారాజా తథా ప్రజ అన్న రీతిలో మరల కాంగ్రెస్ సీనియర్ లకు, రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ అనేది ప్రారంభమైంది.తాజాగా హుజూరాబాద్ లో ఘోర ఓటమి చెందడంలో రేవంత్ పాత్ర ఉందని గత ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో 60 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయని ఈ సారి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని తాజాగా ఢిల్లీలో కెసీ వేణుగోపాల్ అధ్యక్షతన వార్ రూమ్ లో జరిగిన సమావేశంలో వేణు గోపాల్ దృష్టికి కాంగ్రెస్ సీనియర్ లు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది.
అయితే హుజూరాబాద్ లో ఘోర ఓటమిపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సోనియా గాంధీ కాంగ్రెస్ ఘోర ఓటమికి గల కారణాలపై నివేదిక కోరిన విషయం తెల్సిందే.కావున కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసీ వేణుగోపాల్ క్షేత్ర స్థాయి నేతలను కూడా సంప్రదించి ఒక స్పష్టమైన నివేదికను సోనియా గాంధీకి అందజేసే అవకాశం ఉంది.
అయితే కాంగ్రెస్ లో సీనియర్ లు కలసి పనిచేయాలని హైకమాండ్ తాజాగా జరిగిన సమావేశంలో కూడా అందరి నేతలను కూడా కోరడం జరిగింది.అయితే మరి హైకమాండ్ సీనియర్ లకు కలసి పనిచేయాలని చెప్పడం కొత్త కాకపోయినా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అయినా స్వంత ఇబ్బందులను మానుకొని పార్టీ అభివృద్దికి కలసి పనిచేస్తే కానీ కాంగ్రెస్ సత్తా చాటే అవకాశం లేదు.