టీ20 ప్రపంచ కప్ 2021 భాగంగా అనేక సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.ముఖ్యంగా శనివారం రోజు క్రియేట్ అయినా రికార్డులు అన్నీ ఇన్నీ కావు.ఈ ఒక్క రోజే ఎన్నడూ లేని విధంగా సిక్సర్ల వర్షం కురిసింది.టీ20 ఫార్మాట్‌లో సుదీర్ఘమైన సిక్స్ రికార్డు కేవలం కొన్ని గంటల వ్యవధిలో రెండుసార్లు బద్దలు కావడం విశేషం.వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ తో సహా జోస్ బట్లర్, ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆసిఫ్ అలీ వంటి ఆటగాళ్లు సిక్సర్లతో చెలరేగి పోయారు.ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ ఆడిన గ్రూప్-మ్యాచ్‌లో అద్భుతాలు నమోదయ్యాయి.
ఈ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లియామ్ లివింగ్‌స్టన్ సిక్సర్ల వర్షం కురిపించాడు.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 190 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ టీం ముందు ఉంచింది.
అయితే మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్‌కు వచ్చిన లివింగ్‌స్టన్ 16వ ఓవర్ లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు.కగిసో రబాడ వేసిన బంతులను వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు.
వీటిలో తొలి సిక్సర్ ఏకంగా 112 మీటర్ల దూరంలో వెళ్లి పడింది.ఇప్పటివరకు ఇంత దూరమైన భారీ సిక్స్‌ను కొట్టడం టోర్నమెంట్‌లో ఇదే తొలిసారి.
లివింగ్‌స్టన్ కంటే కొద్ది గంటల ముందు ఆండ్రీ రస్సెల్ 111 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు.ఆ రికార్డును లివింగ్‌స్టన్ బద్దలు కొడుతూ 112 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు.
ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతిని రస్సెల్ భారీ సిక్సర్ బాదాడు.
లివింగ్‌స్టన్, రస్సెల్ కంటే ముందు టీ20 వరల్డ్ కప్ 2021లో అఫ్ఘనిస్తాన్ ఆటగాడు నజీబుల్లా జద్రాన్ కొట్టాడు.గ్రూప్ 2 తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై జద్రాన్ 103 మీటర్ల భారీ సిక్సర్ కొట్టి సంచలనం సృష్టించాడు.ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్, న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ కూడా 102 మీటర్ల పొడవైన సిక్సర్లు కొట్టి వావ్ అనిపించారు.