ఫిబ్రవరిలో విడుదల కానున్న శర్వానంద్, శ్రీ కార్తీక్, ‘ఒకే ఒక జీవితం..

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్‌ లో 30వ సినిమాగా రూపొందుతోన్న మైల్ స్టోన్ మూవీ ఒకే ఒక జీవితం.ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.

 Sharwanand, Sri Karthik, Which Will Be Released In February, Oka Oka Jeevitham,-TeluguStop.com

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు.

దీపావళి సందర్బంగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు.ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో అక్కినేని అమల గోడపై కూర్చుని ఉన్నారు.శర్వానంద్, అతని తమ్ముడు అమ్మ ఒడిలో తల పెట్టుకుని అలా సేద తీరుతున్నారు.

ఈ పోస్టర్‌తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడుతున్నాయి.

Telugu Amala Akkinani, Drama, Reethu Varma, Sharwanand, Srprabhu, Sri Karthik, T

తెలుగమ్మాయి రీతూ వర్మ ఈ చిత్రంలో శర్వానంద్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్నారు.వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ చిత్రంలో భాగం అయ్యారు.శర్వానంద్‌కు క్రేజ్ కి తగ్గట్టుగా ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్‌ను ఆకట్టుకునేలా ఉండబోతోంది.

తల్లీ కొడుకుల బంధం అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

నటీనటులు :

శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు.

సాంకేతిక బృందం

రచయిత, దర్శకుడు : శ్రీ కార్తీక్ నిర్మాతలు : ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభుప్రొడక్షన్ కంపెనీ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్ డైలాగ్స్ : తరుణ్ భాస్కర్ డీఓపీ : సుజిత్ సారంగ్ ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్సంగీతం : జేక్స్ బిజోయ్ఆర్ట్ డైరెక్టర్ : ఎన్ సతీష్ కుమార్ స్టంట్స్ : సుదేష్ కుమార్ స్టైలిష్ట్ : పల్లవి సింగ్ లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్ పీఆర్వో : వంశీ-శేఖర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube