పాములు అంటేనే మనకు విపరీతమైన భయం కదా.పాములు దగ్గరకు వస్తేనే మనం ఆమడ దూరం పారిపోతుంటాం.
అలాంటిది కొందరు మాత్రం దాన్ని ఏమాత్రం భయం లేకుండా పట్టుకుంటారు.వారి ధైర్యం చూస్తే నిజంగానే ముచ్చటేస్తుంది.
ఎంత పెద్ద సైజులో ఉన్న పామును అయినా కూడా వారు చాలా సునాయాసంగా పట్టుకుంటారు.ఇలాంటి ఘటనలు మనకు ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
ఇలాంటి వీడియోలకు నెట్టింట కూడా బాగానే ఆదరణ ఉంటుంది.అందుకే నిముషాల్లోనే వైరల్ అయిపోతుంటాయి.
మామూలుగానే పాములకు సంబంధించిన వీడియోలు అంటే ఇట్టే జనాలు అట్రాక్ట్ అవుతుంటారు.అలాంటిది కొండచిలువలకు సంబంధించింది అంటే వైరల్ కాకుండా ఉంటుందా చెప్పండి.ఓ వ్యక్తి ఇలాగే ఓ భారీ కొండ చిలువను మోసుకెళ్తున్నాడు.ఏంటీ కొండ చిలువనా అని ఆశ్చర్యపోతున్నారు కదా.
ఎందుకంటే కొండచిలువ అంటేనే దాని దగ్గరకు ఏదైనా మింగేస్తుంది.అంత డేంజర్.
క్రూర మృగాలు కూడా దాని దగ్గరకు వెళ్లేందుకు వణికిపోతుంటాయి.అలాంటిది ఏకంగా 15 అడుగుల కంటే పొడవైన అత్యంత భయంకరమైన సైజులో ఉన్నటువంటి కొండచిలువ అది.
అలాంటి కొండ చిలువను వైరల్ వీడియోలో ఓ వ్యక్తి తన భుజంపై తీసుకెళ్లడాన్ని చూస్తే నిజంగానే షాక్ అవుతున్నారు.కొండ చిలువ తల భాగాన్ని తన ముందు పెట్టుకుని వెనకాల దాని బాడీని లాక్కుని మేడమీదకు వెళ్తున్నాడు.ఇలా వెళ్తుండగా ఆ పాము సైజు చాలా క్లియర్ గాకనిపిస్తుంది.దాదాపు ముగ్గు లేదా నలుగురు మనుషుల సైజలో ఉన్న దాన్ని చూసేందుకే భయపడిపోతున్నారుఉ.అంత పెద్ద కొండ చిలువను తీసుకెళ్తున్న ఈతన్ని చూసిన వారంతా కూడా ఏం ధైర్యం రా బాబూ అని పొగిడేస్తున్నారు.ఇప్పటికే ఈ వీడియోను 6 వేల మందికిపైగా లైక్స్ చేశారు.
.