భారత్ పై ఆంక్షలు వద్దు...బిడెన్ కు సెనేటర్ల లేఖ...!!

2018 లో భారత ప్రభుత్వం రష్యా నుంచీ 540 కోట్ల డాలర్లతో ఎస్ -400 క్షిపణులను కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

అదే సమయంలో అమెరికా కాట్సా ( కాట్సా అంటే అమెరికా తన ప్రత్యర్ధులపై ఆర్ధిక ఆంక్షలను ప్రయోగించడానికి ఉపయోగించే చట్టం) చట్టాన్ని అమలు లోకి తీసుకువచ్చింది.

ఈ చట్టం అమలుతో రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా తో రక్షణ ఉత్పత్తుల సయోధ్య కుదుర్చుకునే ఇతర దేశాలపై ఆంక్షలు విధించే అధికారం ఉంటుంది.ఈ కారణంగా రష్యా నుంచీ క్షిపణులు కొనుగోలు చేసేందుకు సిద్దమైన భారత్ పై ఈ చట్టం విధించే అవకాశం ఉన్న నేపధ్యంలో అమెరికాలో పలువురు సెనేటర్లు అధ్యక్షుడు బిడెన్ కు లేఖను రాశారు.

రష్యా నుంచీ ఎస్ -400 క్షిపణులను కొనుగోలు చేస్తున్న భారత్ పై ఎలాంటి ఆంక్షలు విధించవద్దంటూ లేఖలో పేర్కొన్నారు.రిపబ్లికన్ పార్టీకి చెందిన జాన్ కోర్నిన్, అలాగే బిడెన్ సొంత డెమోక్రటిక్ పార్టీ కి చెందిన సెనేటర్ మార్క్ వార్నర్ లు ఈ లేఖను బిడెన్ కు రాశారు.

భారత్ పై ఆంక్షలు విధించక పోవడం ఎంతో మంచిదని, ఈ నిర్ణయం భారత్ కు మాత్రమే కాదు అమెరికా జాతీయ బద్రత కు సంభందించిన విషయమని మీకు ఈ కాట్సా చట్టంలో నిభంధనలపై మినహాయింపు ఇచ్చే పూర్తి అధికారాలు ఉన్నాయని అమెరికా భద్రత దృష్ట్యా మంచి నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

టెక్నాలజీ, ఇంధన, వ్యాక్సిన్, రక్షణ వంటి కీలక విషయాలలో భారత్ తో అమెరికాకు మంచి సంభంధాలు ఉన్నాయని ఇలాంటి సమయంలో ఆంక్షలు విధించడం వలన ఇరు దేశాల సంభందాలపై ప్రభావం చూపుతుందని, ఇప్పటికే అమెరికా భారత్ కు మిత్ర దేశం కాదంటూ వస్తున్న ప్రచారంపై భారత్ ఆలోచన చేసే అవకాశం ఉంటుందని దీనిపై సుధీర్గమైన పరిష్కారం అవసరమని, భారత్ తో దీర్ఘకాలిక సంభంధాలు అమెరికాకు ఎంతో మంచివని, ఈ మేరకు భారత్ తో చర్చలు జరపాలని లేఖలో కోరారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు