తెలంగాణ రాజకీయాలలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన విషయం విడితమే.ఎంతలా హాట్ టాపిక్ గా మారినదంటే విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారని చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇక నిన్నటితో ప్రచారానికి గడువు ముగియడంతో ఇక ఎలక్షనీరింగ్ పై పార్టీలు దృష్టి పెట్టాయి.ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రకరకాల అస్త్రాలు ప్రయోగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.
ఇప్పటికే పలు రకాల సర్వేలు టీఆర్ఎస్ ముందంజలో ఉందని చెబుతుండగా, ఇంకొన్ని సర్వేలు మాత్రం బీజేపీ ముందంజలో ఉందని చెబుతున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా ఇటు గెలుపుపై బీజేపీ, టీఆర్ఎస్ లు గెలుపుపై నమ్మకంగా ఉన్న పరిస్థితి ఉంది.
ఒకవేళ ఈటెల ఈ ఎన్నికలో ఒడిపోతే రాజకీయంగా కొంత ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.ఎందుకంటే ఇప్పటివరకు హుజూరాబాద్ లో ఈటెల ఓటమి పాలైన ఎన్నిక లేదు.
ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే టీఆర్ఎస్ అక్కడ ఈటెల ను నిలువరించడానికి మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.దీంతో ఈటెల క్రమంగా హుజూరాబాద్ లో పట్టు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.ఈటెల మాత్రం తన గెలుపు పై నమ్మకంతో ఉన్నా బీజేపీ మీద ఉన్న నెగెటివ్ ప్రచారం తన గెలుపుకు అడ్డంకిగా మారే అవకాశం ఉందనే భావన ఈటెల మదిలో ఉంది.
అందుకే పలు ప్రచార సభల్లో ఏకంగా బీజేపీని కాదు, నన్ను చూసి ఓటేయండి అని వ్యాఖ్యానించారంటే ఎక్కడో ఏ మూల ఈటెలకు బీజేపీపై చేస్తున్న నెగెటివ్ ప్రచారం తనకు అడ్డంకిగా మారుతుందనే భావన ఉందనేది అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఏది ఏమైనా హుజూరాబాద్ లో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.