వచ్చే ఏడాది 2022 లో జరగబోయే ఐపీఎల్ లో భాగంగా మరో రెండు కొత్త టీమ్స్ చేరబోతున్నాయి.ఇందుకు సంబంధించి సోమవారం నాడు దుబాయ్ లో జరిగిన సమావేశంలో భాగంగా బిసిసిఐ నిర్ణయాన్ని వెల్లడించింది.
కొత్త జట్టులలో భాగంగా తాజాగా దాఖలైన దరఖాస్తుల ప్రకారం అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి మొత్తంగా రెండు కొత్త ఫ్రాంచైజీ లను ఏర్పాటు చేయబోతున్నట్లు బిసిసిఐ వెల్లడించింది.చాలా రోజుల నుంచి ఐపీఎల్ అభిమానులు రాబోయే కొత్త జట్ల గురించి అనేక వార్తలు వస్తున్న చివరికి సోమవారం నాడు ఆ వార్తలకు బిసిసిఐ చెక్ పెట్టినట్లు అయ్యింది.
ఇందులో భాగంగానే కొత్తగా అహ్మదాబాద్, లక్నో నగరాలు ఐపీఎల్ లో కొత్తగా చేరబోతున్నట్లు బీసీసీఐ నిర్ధారించింది.మొత్తంగా ఈ పోటీలలో మొత్తం 6 జట్లు పోటీ పడిన చివరకు ఈ రెండు జట్లు మాత్రమే ఐపీఎల్ లో స్థానాన్ని సంపాదించాయి.
ఇక లక్నో జట్టు విషయానికి వస్తే.RPSG గ్రూపు సంస్థ ఏకంగా 7000 కోట్ల రూపాయలను వెచ్చించి బిడ్ ను కైవసం చేసుకుంది.
ఇక మరోవైపు అహ్మదాబాద్ జట్టును ప్రైవేట్ ఈక్విటీ సంస్థ CVC ఏకంగా 5,600 కోట్ల రూపాయలను వెచ్చించి మరో జట్టును బిడ్ రూపంలో సంపాదించింది.

దీంతో బిసిసిఐకి ఈ 2 కొత్తజట్ల రూపంలో ఏకంగా 12,600 కోట్ల రూపాయలు చేరనున్నాయి.ఇకపోతే అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉండగా మరో నగరమైన లక్నోలో క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉండటంతో ఈ రెండు జట్లకు కలిసి రానుంది.చూడాలి మరి కొత్తగా రాబోయే ఈరోజు జట్లు ఎంతవరకు మిగతా జట్లపై ప్రభావం చూపనున్నాయో.