అమెరికా సంచలన నిర్ణయం...తెలుగు శాస్త్రవేత్తపై నిషేధం...!!!

అమెరికా ప్రభుత్వంలోని కొన్ని కీలక విభాగాలు ప్రయోగాత్మకమైన పరిశోధనలు చేపడుతూ ఉంటాయి.ఈ పరిశోధనల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆహ్వానిస్తాయి.

 Us Sensational Decision Ban On Telugu Scientist , America, Telugu Nri Scientis-TeluguStop.com

అత్యుత్తమమైన పరిశోధనలకుగాను గుర్తింపు, గౌరవం కూడా అందిస్తాయి.ఈ క్రమంలోనే అమెరికా కీలక విభాగానికి చెందిన ఓ సంస్థ జన్యుపరమైన అంశాలపై పరిశోధనలకు ఆహ్వానం అందించింది.

దాంతో అమెరికాలో ఉండే ఇద్దరు తెలుగు ఎన్నారై శాస్త్రవేత్తలతో పాటు తెలంగాణలోని OU వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కూడా భాగస్వాములుగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.ముగ్గురూ కలిసి చేపట్టిన ఈ పరిశోధన ప్రఖ్యాత నేచర్ జర్నల్ లోని సైంటిఫిక్ రిపోర్ట్స్ లో పబ్లిష్ అయ్యింది.

అయితే పరిశోధన ఫలితాలపై అనుమానం వచ్చి లోతైన విచారణ చేపట్టిన అమెరికా ఆఫీస్ ఆఫ్ రీసెర్చ్ ఇంటిగ్రిటీ వారికి అసలు విషయం అర్థమయ్యింది.వారు ప్రచురించిన పరిశోధన నకిలీ పరిశోధనని తేల్చి చెప్పింది.

దాంతో ఈ ముగ్గురులో ప్రధాన శాస్త్రవేత్తపై నిర్వాహకులు సీరియస్ అయ్యారు.అమెరికా ప్రభుత్వ నిధులతో చేపట్టే ఎలాంటి పరిసోధనల్లో 5ఏళ్ళ పాటు పాల్గొనకుండా నిషేధం విధించారు.

ఈ పరిస్థితులు మరొక్క సారి జరగకుండా ఉండాలని హెచ్చరించారు.

ఇదిలాఉంటే ఈ మొత్తం నకిలీ పరిశోధనలో హైదరాబాద్ లోని OU ప్రొఫెసర్ సహా బాగాస్వామిగా ఉన్నట్లుగా గుర్తించి అమెరికా ఫెడరల్ రిజిస్టర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ నుంచీ భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి నివేదిక అందించింది.

దాంతో ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టలాని కేంద్రం OU కు లేఖను రాసింది.ఈ విషయంపై స్పందించిన కీలక అధికారి ఈ విషయంపై విచారణ చేపదుతున్నామని ప్రకటించారు.

కాగా వీరి పరిశోధనను వెబ్సైటు నుంచీ తొలగించినట్టుగా నేచర్ జర్నల్ తాజాగా ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube