వైరల్ వీడియో: శునకానికి చుక్కలు చూపించిన పిల్లి..!

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి వింతలు, విశేషాలు జరిగినా ఇట్టే తెలిసిపోతున్నాయి.నిత్యం ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 Viral Video Pet Dog Ran By Seeing The Cat Funny Video, Viral Video, Social Media-TeluguStop.com

ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోల గురించి అయితే చెప్పనవసరం లేదు అనే చెప్పాలి.నెటిజన్లు కూడా జంతువుల వీడియోలను చూడడానికి చాలా ఆసక్తి కనుబరుస్తున్నారు.

కొన్ని జంతువుల వీడియోలు చూడడానికి ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం చూడడానికి భయంకరంగా ఉంటాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా రెండు జంతువులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఈ వీడియోను చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా కుక్కని చూస్తే పిల్లికి భయం.ఎక్కడ తినేస్తుందో అని.అలాగే కుక్కకు పిల్లిని చూస్తే పండగే పండగ ఈరోజు భలే మంచి ఆహారం దొరికింది అని.అయితే మనం చూసే ఈ వీడియోలో మాత్రం రివర్స్ లో ఒక పిల్లి కుక్కనే భయపెట్టి పరుగులు పెట్టించింది.అదేంటి అనుకుంటున్నారా ఇది నిజంగానే జరిగింది అండి.

ఒకసారి వీడియోను పరిశీలిస్తే ఒక పెంపుడు కుక్క ఇంటిలోపల ఉండగా అది బయట ఉన్న ఒక నల్లపిల్లిని చూసి గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది.

కుక్క అరుపులు వింటే ఈరోజు పిల్లికి మూడినట్లే అనే అందరు భావించారు.

కానీ అందరి ఆలోచనలు తారు మారు చేసింది ఈ కుక్క.ఒక్కసారిగా తలుపు తెరుచుకోగానే కోపంతో అరుస్తూ పిల్లి మీద దాడి చేయడానికి బయటకు పరిగెత్తుకుని వెళ్ళింది కుక్క.పరుగెత్తుకుంటూ వస్తున్న కుక్కని చూసి ఆ పిల్లి పారిపోకుండా వెంటనే క్రమంలో అప్రమత్తం అయ్యి కుక్క మీద రివర్స్ లో ప్రతిఘటిస్తుంది.ఒక్కసారిగా పిల్లి కోపాన్ని చూసిన కుక్క భయపడిపోయి తోకముడుచుకుని లోపలికి పారిపోయింది.

ఈ వీడియో సోషల్ మీడియాలోను నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.పిల్లి ధైర్యానికి చాలా మంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube