కొత్త ' స్లోగన్ ' తో షర్మిల పాదయాత్ర ?

అధికారంలోకి వచ్చేందుకు,  ప్రజలలో పలుకుబడి పెంచుకునేందుకు పాదయాత్ర ఒకటే సులువైన మార్గంగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.ఈ క్రమంలోనే  తెలంగాణలో వైఎస్సార్పే టిపి పేరుతో కొత్త పార్టీని స్థాపించిన షర్మిల ఇప్పటికే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.

 Ys Sharmila, Telangana, Trs, Kcr, Bjp, Congress, Sharmila Padayathra, Sharmila-TeluguStop.com

అలాగే కాంగ్రెస్, బీజేపీ లపైనా విమర్శలు చేస్తూ వస్తున్నారు.అక్కడితో ఆగకుండా తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి తన పార్టీ బలాన్ని పెంచుకుని పెద్ద ఎత్తున పార్టీలో ఉండేలా చూసుకునేందుకు ఈనెల 20వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు.

చేవెళ్ల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.దీనికి సంబంధించిన ఏర్పాట్లపై లోటస్ పాండ్ లో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది.

ఈ సందర్భంగా పాదయాత్ర రూట్ మ్యాప్ తదితర అంశాలపై చర్చించారు.చేవెళ్లలో బుధవారం ఉదయం 11 గంటలకు షర్మిల భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ తరువాత అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.
14 నెలల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది.ప్రతిరోజు 12 కిలో మీటర్ల మేర ఈ యాత్ర కొనసాగే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఈ సందర్భంగా పార్టీ తరఫున కొత్త స్లోగన్ ను ఆమె హైలెట్ చేయబోతున్నారు.ఈ తరం యువతకు నవతరం నాయకత్వం అనే స్లోగన్ తో ఈ పాదయాత్ర షర్మిల నిర్వహించనున్నారు.

వైఎస్ సంక్షేమ పాలన ఎజెండాగా పాదయాత్ర ను ముందుకు తీసుకెళ్లేందుకు ఆమె ప్లాన్ చేశారు.ప్రతిరోజు రచ్చబండ మాదిరిగా మాట ముచ్చట కార్యక్రమమూ నిర్వహించనున్నారు.

Telugu Congress, Padayathra, Sharmila Slogan, Telangana, Ys Sharmila-Telugu Poli

ప్రతి నియోజకవర్గంలో 3 మండలాలను కవర్ చేసే విధంగా ఈ రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు.పాదయాత్రలో పార్టీలో చేరికలు,  గ్రామాల వారిగా పార్టీని బలోపేతం చేసే విషయాలపైన సమావేశాలు నిర్వహించబోతున్నారు.తన పాదయాత్ర ద్వారా తెలంగాణలో రాజకీయ కలకలం సృష్టించడంతో పాటు,  బలమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు ఆమె ప్లాన్ చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube