శీతాకాలం అంటే కొన్ని ప్రదేశాల్లో మంచు కురవడం కామన్.మన దక్షిణాది ప్రజలకు మంచు కురిసే ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటూ ఉంటారు.
అదే పనిగా మంచు కురిసే సమయంలో ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేయడానికి విహార యాత్రలకు వెళ్తూ ఉంటారు.దక్షిణాది రాష్ట్రాల్లో కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి.ముఖ్యంగా ఉత్తరాదిన మంచు కురిసే ప్రదేశాలు ఎక్కువుగా ఉంటాయి.అందుకే శీతాకాలంలో మంచు కురిసే ప్రదేశాలను ఇష్టపడే వారు ఆయా ప్రాంతాలను సందర్శించేందుకు ఎక్కువుగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
మన దేశంలో ఎక్కువుగా మంచు కురిసే ప్రదేశాలు ఏవంటే.జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో ఎక్కువుగా మంచు కురుస్తూ ఉంటాయి.
అయితే ఎప్పుడు ఈ రాష్ట్రాల్లో శీతాకాలం మొదలవ్వగానే మంచు పడుతుందని అందరికి తెలుసు.కానీ ఈసారి మాత్రం ఇంత శీతాకాలం స్టార్ట్ అవడానికి చాలా సమయం ఉంది.కానీ అప్పుడే ఆ గ్రామం మంచుతో కప్పబడి ఉంది.ఇంకా శీతాకాలం రావడానికి కొద్దిగా సమయం ఉండగానే ఈ గ్రామం అలా మంచుతో కప్పబడి ఉంది.ఈ ఫోటోలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము లోని లాహౌల్ స్పితి జిల్లా లోని ధన్ కర్ గ్రామంలో ఇప్పటికే ఆ ఊరు మొత్తం మంచు తో కప్పబడి ఉంది.ఇంకా శీతాకాలం రాకుండానే ఇలా మంచుకురావడం ప్రారంభం కావడంతో పర్యాటకులు అక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇలా మంచు కురవడంతో ఆ గ్రామం మొత్తం తెల్లటి దుప్పటి పరిచినట్టుగా కనబడుతుంది.ఆ గ్రామాన్ని పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శిస్తున్నారు.దీంతో ఆ గ్రామం మొత్తం సందడి వాతావరణం నెలకొంది.