టైఫాయిడ్ సోకిందా? అయితే వీటికి దూరంగా ఉండాల్సిందే!

టైఫాయిడ్‌.ఈ వ‌ర్షాకాలంలో అత్య‌ధికంగా విజృంభించే వ్యాధుల్లో ఇదీ ఒక‌టి.

 Dont Eat These Foods During Typhoid! Typhoid, Bad Foods, Good Foods, Latest News-TeluguStop.com

తీవ్ర‌మైన త‌ల నొప్పి, ఆక‌లి మంద‌గించ‌డం, నీళ్ల విరేచనాలు, క‌డుపు నొప్పి, రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య ప‌డి పోవ‌డం, ఒళ్లంతా నొప్పులు, నీర‌సం, అల‌స‌ట‌, ఛాతీలో పట్టేసి నట్లుగా ఉండటం ఇలా ఎన్నో ల‌క్ష‌ణాలు టైఫాయిడ్ జ్వ‌రం సోకిన వారిలో క‌నిపిస్తుంటాయి.ఇంట్లో ఒక్క‌రికి వ‌చ్చిందంటే చాలు.

మిగిలిన వారంద‌రికీ వ్యాప్తి చెందే ఈ అంటు వ్యాధి ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైంది.అందుకే దీని బారిన ప‌డితే.

ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.అనేక నియ‌మాలు పాటించాలి.

ముఖ్యంగా టైఫాయిడ్ జ్వ‌రం నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డాలంటే పోష‌కాహ‌రం తీసుకోవాలి.అదే స‌మ‌యంలో కొన్ని కొన్ని ఆహారాల‌కు సైతం దూరంగా ఉండాలి.ఆ ఆహారాలు ఏంటీ.? వాటికి ఎందుకు దూరంగా ఉండాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా క్యాబేజీ, బ్రోకలీ, కాలిఫ్లవర్ వంటి ఆకుకూర‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

కానీ, టైఫాయిడ్ జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ఈ ఆకు కూర‌ల‌ను ఆస్స‌లు తీసుకోరాదు.ఎందు కంటే, ఇవి ఆ స‌మ‌యంలో గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడ‌తాయి.

అలాగే టైఫాయిడ్ జ్వ‌రం సోకిన‌ప్పుడు మసాలు అధికంగా ఉండే ఆహారాల‌ను పూర్తిగా ఎవైడ్ చేయాలి.నెయ్యి లేదా నూనె తో వండిన పదార్థాలకు దూరంగా ఉండాలి.ఫాస్ట్ ఫుడ్స్‌, బేక‌రీ ఫుడ్స్‌ను ద‌రి దాపుల్లోకి రాకుండా చూసుకోవాలి.ఉల్లి,వెల్లుల్లి వంటి ఆహారాల‌ను సైతం ఎంత త‌క్కువ‌గా తీసుకుంటే అంత మంచిది.

ఇక టైఫాయిడ్ జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు.వాట‌ర్‌తో పాటు పండ్ల ర‌సాలు, కొబ్బ‌రి నీళ్లు, వేడి వేడి సూప్స్ వంటి ఎక్కువ‌గా తీసుకోవాలి.

ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.దానిమ్మ పండ్లు, బొప్పాయి, కివి, అర‌టి పండ్లు, ఖ‌ర్జూరాలు, న‌ట్స్‌, పాలు, గుడ్లు వంటివి తీసుకుంటూ ఉండాలి.

త‌ద్వారా టైఫాయిడ్ నుండి త్వ‌ర‌గా కోలుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube