జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఉండవల్లి అరుణ్ కుమార్..!!

ఏపీ రాజకీయాలలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నట్లు విపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.రాష్ట్రంలో జగన్ సంక్షేమ పథకాల కోసం.

 Undavalli Arun Kumar Should Have Warned The Jagan Government Ys Jagan, Undavalli-TeluguStop.com

ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నారని.ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ దారులకు కూడా సకాలంలో వేతనాలు అందించలేని పరిస్థితి ఉన్నట్లు అనేకమంది ఆరోపణలు చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మాజీ ఎంపీ సీనియర్ పొలిటిషన్ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఏపీ ఆర్థిక పరిస్థితి పై తనదైన శైలిలో విశ్లేషించారు.జగన్ ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు చేస్తుందని ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షల కోట్ల అప్పు చేసినట్లు.

అన్ని లెక్కలతో సహా వెల్లడించారు.రాజధాని అమరావతిని సైతం తాకట్టు పెట్టడం జరిగిందని తెలిపారు.

సీఎం జగన్ కి చాలా మంది సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అని ఈ నేపథ్యంలో ఏపీలో ఆర్థికంగా దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయని మరి కొన్నాళ్ళ పాటు ఇదే పరిస్థితి కొనసాగితే ఏపీ సర్కార్ దివాలా తీయడం గ్యారెంటీ అని తెలిపారు.ఇదే రీతిలో అప్పులు చేసుకుంటూ పోతూ ఉండడంతో జాతీయ స్థాయిలో అప్పులు ఎక్కువ చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.

గురించి చర్చలు జరుగుతున్నట్లు ఉండవల్లి చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అనవసరంగా హడావిడి ప్రకటనలు చేయడం సరైన విధానం కాదని చెప్పుకొచ్చారు.

Telugu Ap Financial, Ap Poltics, Chandra Babu, Unavalli, Undavalliarun, Ys Jagan

అంత మాత్రమే కాక చంద్రబాబు హయాంలో పోలవరం పనులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉన్నాయని పోలవరం నిర్వాసితులకు కూడా పరిహారం అందలేదని.ఉండవల్లి ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ పాలన పై ప్రకంపనలు సృష్టించే రీతిలో విశ్లేషించారు.మొత్తంమీద చూసుకుంటే ఒక పక్క డిఫెండ్ చేస్తూనే మరో పక్క ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మోడీ ఒక్క విధివిధానాలు ఆచరించటం లేదని .ఏపీ మాత్రమే ఆచరిస్తూ ఉందని చెప్పుకొచ్చారు.అదేవిధంగా పోలవరం విషయంలో .కేంద్రం యొక్క నిర్లక్ష ధోరణి వల్లే రాష్ట్ర ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడినట్లు ఎక్కడ కూడా పెద్ద మరకలు జగన్ ప్రభుత్వంపై పడకుండా.తనదైన శైలిలో ఉండవల్లి విశ్లేషించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube