యువ హీరో నాగ శౌర్య హీరోగా సుబ్రహ్మణ్యపురం ఫేమ్ సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో వస్తున్న సినిమా లక్ష్య.శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ శౌర్య సరసన కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా రిలీజ్ విషయం లో క్లారిటీ వచ్చింది.నవంబర్ 12న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు.
నాగ శౌర్య నటించిన వరుడు కావలెను సినిమా కూడా దసరా కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ అవుతుంది.నెల రోజుల గ్యాప్ లో నాగ శౌర్య మరో సినిమా లక్ష్య వస్తుంది.
అయితే రెండు సినిమాలు రెండు డిఫరెంట్ కలర్స్ తో నాగ శౌర్య వస్తున్నాడు.తప్పకుండా ఈ రెండు సినిమాలతో నాగ శౌర్య తన సత్తా చాటుతాడని చెప్పొచ్చు.
ఛలో తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు కాని సరైన సక్సెస్ లేని నాగ శౌర్యకు లక్ష్య మంచి కమర్షియల్ హిట్ అందిస్తుందని చెప్పుకుంటున్నారు.వరుడు కావలెను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది.
ఆ సినిమా టీజర్ కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది.